దారిన పోయే చెత్తను నెత్తినేసుకోవటం అంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బాగా ఇష్టం లాగుంది. గుంటూరులో జరిగిన జనసైనికుల సమావేశంలో మాట్లాడుతూ, ‘మెదక్ లో ఎన్టీయార్ మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ తరపున కుక్కను నిలబెట్టినా గెలుస్తుందని మాట్లాడి తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయార’ని చెప్పారు. ‘నావెనుక లక్షలాది మంది జన సైనికులు  ధవళేశ్వరంలో అయినా అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకి ఎక్కించుకోను’. పవన్ తాజా వ్యాఖ్యలతో టిడిపి మండిపడుతోంది. ఇక్కడ నేను తలకు ఎక్కించుకోను అని పవన్ అన్న వ్యాఖ్యలను ఎలా అర్ధం చేసుకోవాలి ? తలకు ఎక్కించుకునేది ఏముంది పొగరు తప్ప.

 Image result for pawan kalyan meeting

ఇక్కడ పవన్ చెప్పదలచుకున్నదేమిటో వెరీ క్లియర్. ఎన్టీయార్ పొగరు బట్టి కుక్కును నిలబెట్టినా గెలుస్తుందని చెప్పారన్నదే పవన్ చెప్పదలచుకున్నారు. నిజానికి అసలు ఎన్టీయార్ మాటలను పవన్ ఇపుడు ప్రస్తావించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఎందుదకంటే, ఎన్టీయార్ ఆ మాటలన్నది దాదాపు ఏ ముప్పై ఏళ్ళ క్రితమో ? ఎప్పుడో అన్న మాటలను ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చింది పవన్ కు ? అంతగా పోలిక చెప్పదలుకుంటే మొన్ననే కదా కాకినాడలో బిజెపి మహిళా కార్పొరేటర్ ను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ ‘నాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతావ్’ అంటూ బహిరంగంగా బెదిరించింది ?

 Image result for pawan kalyan meeting

ఎలా మాట్లాడకూడదో ఉదాహరణలు చెప్పదలుచుకుంటే వివిధ సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలు చాలానే దొరుకుతాయి పవన్ కు. లేదా నంద్యాల ఉప ఎన్నికల సమయంలో చంద్రబాబును ఉద్దేశించి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్న వివాదాస్పద వ్యాఖ్యలు ఉండనే ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం ఎన్టీయార్ అన్న మాటలను ఇఫుడు అదే పనిగా గుర్తు చేయాల్సిన పనేముంది  జనసేనానికి ? చూడబోతే చెత్తను నెత్తినేసుకోవటం పవన్ కు బాగా ఇష్టంలాగుంది.

 Image result for pawan kalyan meeting

ఇప్పటికే సోదరుడు నాగుబాబు-బాలకృష్ణ మధ్య పంచాయితీ తీవ్రంగానే నడుస్తోంది. అప్పుడెపుడో పవన్ అంటే ఎవరో తనకు తెలీదని బాలకృష్ణ అన్నారంటూ  ఇపుడు వరుసబెట్టి నాగుబాబు బాలయ్యకు, ఎన్టీయార్ బయోపిక్ కు వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య పంచాయితి మెగా-నందమూరి అభిమాన సంఘాల మధ్య పెద్ద చిచ్చునే రేపింది. అది చాలదన్నట్లు తాజాగా ఎన్టీయార్ ను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలపై టిడిపి మండిపడుతోంది. మరి పవన్ తాజా వ్యాఖ్యలు ఏ పంచాయితీకి దారితీస్తుందో ఏమో ?


సరిగ్గా ఎన్నికలకు ముందు నందమూరి అభిమాలను కెలుక్కోవటం పవన్ కు ఎంతమాత్రం మంచిది కాదు. నిజంగానే అభిమానులు రెచ్చిపోతే ఆ మేరకు ఎంతో కొంత పవన్ నష్టపోవటం ఖాయమనే అనుకోవాలి. పవన్ తో పొత్తుల కోసం వెంపర్లాడుతున్న కారణంగానో లేకపోతే నాగుబాబుతో జరుగుతున్న గొడవల కారణంగానో టిడిపి సీనియర్ నేతలు ప్రస్తుతానికైతే సంయమనంతోనే ఉన్నారు. మరి ముందుముందు ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: