నరేంద్ర మోడీ ని కొంత మంది నియంత లా వ్యవహరిస్తున్నాడని , ప్రజాస్వామ్యాన్ని నీరుగారుస్తున్నాడని ఇప్పటికే ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నారు.  ఎన్నడూ లేని విధంగా 'సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌' డైరెక్టర్‌ పదవి వివాదాస్పదమవుతోంది ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యమా అని. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మ ఎంపికైంది మొదలు, రచ్చ కొనసాగుతూనే వుంది. నరేంద్ర మోడీ తనకు అనుకూలంగా వుండే రాకేష్‌ ఆస్థానాని స్పెషల్‌ డైరెక్టర్‌గా నియమించి.. అలోక్‌ వర్మపైకి ఉసిగొల్పారు. ఇంకేముంది.? ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వమే కాదు, కుట్రలూ జరిగాయి.

Image result for narendra modi

అలోక్‌ వర్మకి వ్యతిరేకంగా ఆస్థానా పెద్ద కథే నడిపించారు. ఈ రచ్చ ముదిరి పాకాన పడేసరికి, పరువు పోతుందన్న కోణంలో అలోక్‌ వర్మను తాత్కాలిక సెలవుపై వెళ్ళాల్సిందిగా ఆదేశించింది కేంద్రం. అక్కడే మోడీ తప్పులో కాలేశారు.  అలోక్‌ వర్మ, తనను సెలవుపై కేంద్రం పంపాలనుకోవడాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసి, విజయం సాధించారు. కేంద్రం తీరుని సుప్రీం కోర్టు తప్పు పట్టింది.

Image result for alok varma

మామూలుగా అయితే, ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ సర్కార్‌ ఎలాంటి 'కక్ష సాధింపు చర్యలకూ' దిగకూడదు. కానీ, అక్కడున్నది నరేంద్ర మోడీ.. నియంతకి మారు పేరు అన్న విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. అందుకే, క్షణం కూడా ఆలోచించలేదు.. హై పవర్‌ కమిటీ మీటింగ్‌ ఏర్పాటు చేసి మరీ, అలోక్‌ వర్మని సీబీఐ నుంచి దూరం చేసేశారు.  నరేంద్ర మోడీకి మండితే ఇలాగే వుంటుంది.. ఎందుకంటే, ఇది ప్రజాస్వామ్యం కానే కాదు.. ఇది రాచరికం కంటే దారుణం. రాత్రికి రాత్రి దేశంలో 'ఈబీసీ బిల్లు' పాస్‌ అయిపోతుంటుంది.. రాత్రికి రాత్రి పెద్ద నోట్ల రద్దు జరిగిపోతుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: