ఒకపక్క ప్రభుత్వ పరిపాలన మరోపక్క ఎన్నికల గోల ఇలా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనను ఎన్నుకున్న ప్రజలకు మాత్రం న్యాయం చేసే దిశలో ఎక్కడా కూడా వెనుకాడటం లేదు.

Image result for chandrababuఒక పక్క రాష్ట్రంలో విభజన హామీలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టిన తన అనుభవంతో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్న చంద్రబాబు త్వరగా ఎన్నికలు వస్తున్న క్రమంలో అనేక జిల్లాలలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులపై  కేంద్ర ప్రభుత్వంపై వారి చేసిన మోసాలపై తనదైన శైలిలో సామాన్యులకు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిలో చంద్రబాబు సంచలన కామెంట్లు చేస్తున్నారు.

Related image

ఈ క్రమంలో త్వరలో సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించారు చంద్రబాబు. ఏపి సిఎం చంద్రబాబు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు పెద్ద కానుక అందించారు.

Image result for chandrababu

పించన్లు రూ.2వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో సిఎం ఈ ప్రకటన చేశారు. జనవరి నుంచే పెంచిన పించన్‌ చెల్లిస్తారు. దీని ద్వారా 54 లక్షల మంది పించన్‌ దారులకు లబ్ది పొందుతారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరీ మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు లబ్ధి పొందుతారు...అని చంద్రబాబు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: