చూడబోతే అలాగే అనిపిస్తోంది అందరికీ. లేకపోతే జగన్ పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణ మొదలుపెట్టగానే చంద్రబాబు ఎందుకు ఉలికిపడుతున్నారు ? ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తు ప్రధానమంత్రికి చంద్రబాబు లేఖ రాయటంతోనే టిడిపిలో భయమేంటో అర్దమైపోతోంది. నిజానికి తనపై తానే దాడి చేయించుకున్నాడు జగన్ అని కదా చంద్రబాబు అండ్ కో ఇప్పటి వరకూ చెబుతున్నది. తనను హత్య చేసేందుకే తనపై హత్యాయత్నం చేసిందని జగన్ చెప్పుకోవటంలో అర్ధం లేదని చంద్రబాబు ఎన్నోసార్లు వాదించారు. ప్రచారం లేకపోతే సింపతి కోసం జగనే తన అభిమానితో దాడి చేయించుకున్నాడని టిడిపి నేతలు వాదిస్తున్నారు. దాడి ఎలాగూ జరిగింది కాబట్టి సిట్ విచారణ పేరుతో చంద్రబాబు చేతులు దులుపుకున్నారు. అయితే, ఇక్కడే కథ అడ్డం తిరిగింది.

 Image result for jagan attacked in airport

తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై చంద్రబాబు ముందే పోలీసులకు ఓ లీడ్ ఇచ్చేశారు కాబట్టి సిట్ విచారణలో వాస్తవాలు బయటకు రావంటూ జగన్ హైకోర్టులో పిటీషన్ వేశారు. తనపై జరిగిన హత్యాయత్నం ఘటనలో కుట్రదారులెవరో తేలాలంటే థర్డ్ పార్టీ తో విచారణ జరిపించాలని హై కోర్టులో జగన్ వాదించారు. మొత్తానికి హైకోర్టు కూడా జగన్ వాదనతో ఏకీభవించింది. అందుకే ఎన్ఐఏతో విచారణ జరిపిస్తున్నట్లు చెప్పింది. హై కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఎన్ఐఏ కూడా వెంటనే విచారణలోకి దిగేసింది.

 Image result for jagan attacked in airport

ఎప్పుడైతే ఎన్ఐఏ విచారణ మొదలుపెట్టిందో చంద్రబాబు అండ్ కోలో బయటకు చెప్పుకోలేని ఆందోళన మొదలైంది. అప్పటి వరకూ జగన్ పై జరిగింది కోడి కత్తి దాడే అంటూ ఎగతాళి చేసిన చంద్రబాబు అండ్ కో ఆగ్రహమంతా కేంద్రంపైకి మళ్ళింది. అసలు దాడి పేరుతో జగన్ డ్రామాలాడుతున్నాడని చంద్రబాబు చెబుతున్నదే నిజమైతే ఎన్ఐఏ విచారణ అన్నది చంద్రబాబుకు పెద్ద ప్లస్ పాయిటవ్వాలి. ఎలాగంటే, ఎన్ఐఏ విచారణలో గనుక జగన్ పై జరిగింది కేవలం డ్రామా దాడే అని తేలిపోతే చంద్రబాబుకు ఎంత పెద్ద లాభం. దాడి డ్రామాను రేపటి ఎన్నికల్లో చంద్రబాబు ఎంతబాగా ఉపయోగించుకోవచ్చు ? జగన్ బుద్ధిని  ఎన్నికల్లో ఏ స్ధాయిలో ఎండగట్టవచ్చు కదా ?

 Image result for jagan attacked in airport

అంతటి అవకాశం ఎన్ఐఏ విచారణ రూపంలో వచ్చినపుడు చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు ? అంటే విచారణలో హత్యాయత్నం వెనకున్న కుట్ర కోణం బయటపడుతుందనా ? ఎందుకంటే, జగన్ పై హత్యాయత్నం చేయించింది చంద్రబాబే అ వైసిపి నేతలందరూ ఆరోపిస్తున్నారు. ఎన్ఐఏ విచారణలో వైసిపి నేతల ఆరోపణలే నిజమనే విషయం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారా ? చూడబోతే చంద్రబాబులో ఆందోళన అలాగే అనిపిస్తోంది అందరికీ. లేకపోతే ఎన్ఐఏ విచారణను చంద్రబాబు ఎందుకంతగా వ్యతిరేకిస్తున్నారు ?

 Image result for jagan attacked in airport

అసలు ఎన్ఐఏ విచారణకు కేంద్రం కాదుకదా ఆదేశించింది ? ఎన్ఐఏ విచారణకు జగన్ కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకున్నారు. కాబట్టి చంద్రబాబు ఏమన్నా అడగదలచుకుంటే అడగాల్సింది కోర్టునే కానీ కేంద్రాన్ని కాదు. మరి కోర్టును అడగాల్సిన చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు వివాదంలోకి లాగుతున్నారు ? ఎందుకంటే, నరేంద్రమోడి, జగన్ కలిసి తనపై కుట్ర చేస్తున్నారని జనాల్లో సింపతి కొట్టేయటానికి. జగన్ పై జరిగిన దాడి గురించి చంద్రబాబు పక్కనపెట్టి ఎన్ఐఏ విచారణను మాత్రమే చంద్రబాబు హైలైట్ చేస్తున్నారు. అంటే అనవసర విషయాల్లో యాగీ చేయటం ద్వారా హత్యాయత్నం ఘటనను పక్కదారి పట్టించటమే చంద్రబాబు ఉద్దేశ్యమా ?


మరింత సమాచారం తెలుసుకోండి: