తనకు, హీరో ప్రభాస్ కు వివాహేతర సంబంధం ఉందని సోషల్ మీడియాలో ఒక వర్గం చేస్తున్న ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన భర్త అనిల్ కుమార్ తో కలిసి వచ్చి, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ కు ఫిర్యాదు చేసిన వైఎస్ జగన్ సోదరి షర్మిళ, ఆపై మీడియాతో మాట్లాడుతూ...నాకు, ప్రభాస్ అనే ఒక మూవీ స్టార్ కు సంబంధం ఉందనే దుష్ర్పచారాన్ని ఆన్ లైన్ లో ఒక క్యాంపెయిన్ లాగా, నడిపింది ఒక వర్గం. 

Image result for sharmila ys

అప్పట్లో 2014 ఎన్నికల తరువాత, నేను ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. విచారణ చేసి, పోలీస్ యాక్షన్ తరువాత, కొంతకాలం ఈ దుష్ప్రచారం ఆగింది.  కానీ, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి గనుక, ఈ విష ప్రచారానికి మళ్లీ వేగం పెంచారు. వీళ్ల మోటివ్ ఒక్కటే. నా క్యారెక్టర్ అసాసినేషన్. తప్పును తప్పు అని ఎత్తి చూపడానికి చట్ట ప్రకారం... ఈ ప్రచారాలను సృష్టిస్తున్నవారి మీద, వారి వెనకాల ఉన్న వారి మీదా చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. 

Image result for sharmila ys

తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారు కాకుండా, తప్పుడు ప్రచారాలు చేయిస్తున్న వారు కాకుండా, ఈరోజు ఇలా నేను ఒక దోషిలాగా నిలబడి, నా వాదనను వినిపించుకోవాల్సిన దుస్థితి రావడం నాకే కాదు. మహిళలందరికీ ఇది అవమానకరం. ఇది ఐదేళ్ల కింద ఎప్పుడో మొదలైంది.  ఇది నా ఒక్కదానికే జరిగిన అవమానంగా నేను భావించడం లేదు. ఇలాంటి రాతలు, ఇంకెంతో మంది మహిళల మీద కూడా రాస్తున్నారు. వెబ్ సైట్లలో, సోషల్ మీడియాలో ఈ ప్రచారాలకు వీలేలేకుండా, కఠిన చర్యలు తీసుకోవాలి అన్న నా కంప్లయింట్ కు మద్దతు పలకవలసిందిగా, ప్రజాస్వామ్య వాదులను, నైతికత ఉన్న రాజకీయ నాయకులను, జర్నలిస్టులను, మహిళలను కోరుతున్నాం అని వైఎస్ షర్మిళ వ్యాఖ్యానించారు.  


తనపై, తన కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయనకు అందించానని, ఆయన సానుకూలంగా స్పందించి, విచారణ జరిపిస్తానని మాటిచ్చారని అన్నారు. షర్మిళతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్, వైకాపా నేతలు వైసీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: