ఫొటోలో కనిపిస్తున్న డాక్టర్ సాబ్ ఎవరో తెలుసా ? రాబోయే ఎన్నికల్లో వైసిపి తరపున జమ్మలమడుగులో పోటి చేయబోయే అభ్యర్ధి. జమ్మలమడుగు పర్యటనలో ఉన్న జగన్ వచ్చే ఎన్నికల్లో డాక్టర్ సుధీర్ రెడ్డినే పార్టీ అభ్యర్ధిగా బహిరంగంగా ప్రకటించారు. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన ఆది నారాయణరెడ్డి తర్వాత తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించి మంత్రైన విషయం తెలిసిందే. ఆది పార్టీ ఫిరాయించిన దగ్గర నుండి జమ్మల మడుగు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలన్నింటినీ డాక్టర్ సుధీర్ రెడ్డే చూస్తున్నారు. జనాల్లోకే కాకుండా పార్టీ నేతలతో మంచి సంబంధాలున్న డాక్టర్ సాబ్ పార్టీ కార్యక్రమాలతో చొచ్చుకుపోతున్నారు లేండి.

 

అటువంటి డాక్టర్ నే అభ్యర్ధిగా ప్రకటించటంతో పార్టీ నేతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ , మాజీ మంత్రి డాక్టర్ మైసూరా రెడ్డి తమ్ముడి కొడుకే ఈ సుధీర్ రెడ్డి. అంటే రాజకీయాలకు కొత్తేమీ కాదని అర్ధమైపోతోంది కదా ? అందుకే రాజకీయాల్లో బాగా చొచ్చుకుపోతున్నారు. డాక్టర్ గా జనాలకు బాగా సుపరిచితుడే కావటంతో పార్టీ విధానాలను జనాల్లోకి తీసుకెళ్ళటంలో పెద్దగా ఇబ్బందులేమీ పడటం లేదు. నిజానికి రానున్న ఎన్నికల్లో సుధీర్ పోటీ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే జగన్ అధికారికంగా ప్రకటించేంత వరకూ వెయిట్ చేయక తప్పదు కదా ? అందుకే సుధీర్ కూడా వైసిపి అభ్యర్ధిగా కాకుండా నేతగానే చెలామణి అవుతున్నారు.

 

ఎప్పుడైతే జగన్ అధికారికంగా ప్రకటించారో వెంటనే ఆదికి ప్రత్యర్ధిగా పాపులరైపోతున్నారు. వైసిపి తరపున పోటీ చేయబట్టే ఆది పోయిన ఎన్నికల్లో గెలిచారట. ఎప్పుడైతే తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించారో అప్పటి నుండే పార్టీ శ్రేణులే కాకుండా నియోజకవర్గంలో జనాలు కూడా బాగా మండుతున్నారట. ఆ విషయం తెలియటంతోనే చంద్రబాబునాయుడు కూడా వచ్చే ఎన్నికల్లో ఆదికి కాకుండా రామసుబ్బారెడ్డికి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అయితే, ఇక్కడ టిడిపి అభ్యర్ధి ఆదా లేకపోతే రామసుబ్బారెడ్డా అన్నది ప్రధానం కాదు. ఎందుకంటే, చంద్రబాబు పాలనపై జనాల్లో విపరీతమైన మంటుంది. అందుకనే సుధీర్ రెడ్డి గెలుపు ఖాయమని వైసిపి నమ్మకంతో ఉంది.  మరి ఏం  జరుగుతుంతో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: