2014 ఎన్నికల సమయంలో కలసి పోటీ చేసిన బిజెపి-టిడిపి పార్టీలు తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల విడిపోయాయి. ముఖ్యంగా చట్టపరంగా విభజన హామీల విషయంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిందని చెప్పి ఇటీవల ఎన్డీయే కూటమి నుండి బయటకు వచ్చారు చంద్రబాబు.

Image result for chandrababu

విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత కష్టాలు పాలు చేసిందని ఇటీవల భారీ బహిరంగ సభలలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో రాష్ట్రాలను అన్యాయం చేసే పార్టీలను వారి సిద్ధాంతాలను ఏకిపారేశారు.

Related image

ముఖ్యంగా తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కేంద్రం రాష్ట్రానికి సరిగ్గా నిధులు గాని హామీలు గాని నెరవేర్చలేదని ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లిన సరైన రెస్పాన్స్ లేదని పేర్కొన్నారు.

Image result for chandrababu

ఈ క్రమంలో ఇటీవల టిడిపి నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న చంద్రబాబు..కోల్‌కతా లో చారిత్రాత్మక సభ జరిగిందని, దేశ ప్రజల్లో కోల్‌కతా సభ ఓ భరోసా ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. కోల్‌కతా సభ నిరంకుశ పాలన అంతానికి నాంది పలికిందన్నారు. అమరావతిలో కూడా దానికి ధీటైన సభ నిర్వహిస్తామన్నారు. 22 పార్టీల నేతలు అమరావతి సభకు వస్తారని ఆయన పేర్కొన్నారు. మోడి నాయకత్వంలో దేశం తిరోగమనం చెందిందని, నెగిటివ్ లీడర్‌గా మోదీ మారారని విమర్శించారు. మోదీ పాలనలో అభివృద్ధి స్తంభించిందని చంద్రబాబు ఆరోపించారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: