జాతీయ స్ధాయిలో చంద్రబాబునాయుడుకు చక్రం తిప్పే మహత్తర అవకాశం మరోసారి వచ్చింది. ఇంతకీ ఆ అవకాశం ఏమిటంటే, ప్రత్యేకహోదా అంశం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య నాలుగున్నరేళ్ళుగా నలుగుతోందన్న విషయం తెలిసిందే కదా ? అంటే హోదా కావాలని చంద్రబాబు నాలుగున్నరేళ్ళుగా డిమాండ్ చేస్తున్నారని కాదులేండి. నిజానికి హోదా కావాలని చంద్రబాబు ఏరోజు డిమాండ్  చేయలేదని కేంద్రమంత్రులే చెప్పారు. హోదా విషయంలో చంద్రబాబు ఎన్ని పిల్లిమొగ్గలు వేసింది అందరూ చాలా సార్లే చూశారు. సరే అయ్యిందేదో అయిపోయింది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా ?

 

ఎలాగూ బిజియేతర పార్టీలను ఎలాగూ ఏకతాటిపైకి తేవటానికి కృషి చేస్తున్నానని కదా చెప్పుకుంటున్నారు. దాదాపు 22 ప్రాంతీయ పార్టీల్లో నిజంగానే అంత కీలక భూమిక పోషిస్తుంటే ఆ మహదవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు ? బిజెపియేతర పార్టీలను ఏకతాటిపైకి తెస్తున్నట్లు ఒకటే ఊదరగొడుతున్న చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా కోసం అందరి మద్దతుతో సంతకాలు తీసుకోవచ్చు కదా ? నిజంగానే మిత్రపక్షాల నేతలు చంద్రబాబుకు అంతగా ప్రాధాన్యత ఇస్తుంటే ప్రత్యేకహోదాకు మద్దతుగా అందరిచేత సంతకాలు పెట్టించుకోవచ్చు కదా ?

 

కానీ అది జరగని పని అందరికీ తెలుసు. ఎందుకంటే, చంద్రబాబు చెప్పుకుంటున్నట్లుగా మిత్రపక్షాల నేతల దగ్గర అంత సీన్ లేదని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అండ్ కో ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు చెప్పుకుంటున్నట్లుగా మిత్రపక్షాలేవి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదట. మొన్నన జరిగిన కోల్ కత్త ర్యాలి సందర్భంలో కూడా చంద్రబాబును పెద్దగా పట్టించుకోలేదట. షో మొత్తం మమతా బెనర్జీ తర్వాత మాయావతి, అఖిలేష్ యాదవ్ దే నట. అందుకనే ప్రత్యేకహోదాకు మద్దతుగా మిత్రపక్షాల నుండి లేఖలు కానీ కనీసం వాళ్ళ సంతకాలు కూడా తీసుకోవటానికి చంద్రబాబు ప్రయత్నం చేయటం లేదని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: