ఈ దేశంలో ఘనత వహించిన రాజ్యాంగం ఉంది. ఎదరో ఉద్దండులు ప్రముఖులు, న్యాయ కోవిదులు, తత్వ వేత్తలు, రాజనీతిపరులు అంతా కలసి కొన్నేళ్ళ పాటు శ్రమించి ఈ దేశ కాల మాన పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసిన మీదట అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించారు. ఈ దేశ రాజ్యాంగం చదివితే చాలు భగవద్గీతను చదివినట్లు ఉంటుంది. గొప్ప సమాజం ఎలా ఉండాలో చాటి చెబుతుంది. ఉత్తమమైన పౌరుడు ఎలా ఉండాలో రాజ్యాంగం తెలియచేస్తుంది. 


అర్ధం తెలుసా :


ఈ రోజు దేశ స్వాతంత్రానికి విలువ లేకుండా పోయింది. ఆగస్ట్ పదిహేను అంటే అది  ఒక సెలవు దినంగా భావిస్తున్నారు తప్ప ఆ రోజు విశిష్టతను ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఒకనాడు మన దేశం బానిసత్వంలో మగ్గుతూ ఎన్నో దురవస్థలు పడుతున్న వేళ కొన్ని దశాబ్దాల పాటు సాగిన పోరాటంలో ఎందరో అసువులు బాసి సాధించుకున్నది మన దేశ స్వాతంత్రం. అటువంటి దేశాన్ని ఒక్కటిగా కలిపి ఉంచాలనుకున్నప్పుడు పుట్టిన ఆలోచనా ఫలితమే భారత  రాజ్యాంగం. ఒకరిద్దరు కాదు ఎందరో పండితులు కలసి మనకు ఈ రాజ్యాంగాన్ని రచించి అందించారు.


గణ తంత్రం అంటే :


ఈ దేశంలో ముందు తరాల సంగతి ఎలా ఉన్నా ఇప్పటి వారికి గణ తంత్ర వేడుకల ప్రాధాన్యత అన్నది తెలియడంలేదు. ఎందుకు ఆ రోజున పండుగగా జరుపుకుంటామన్నది అర్ధం కాదు. ఈ దేశానికి మరో స్వాతంత్ర దినంగా ఆ రోజుని భావించి మన పూర్వీకుల, దేశ భక్తులను మనపూర్వకంగా స్మరించుకుటాం. వారి ఆశయాల సాధన కోసం శపధం చేస్తాం. ఆ రోజున రాష్ట్రపతి ఇచ్చే సందేశం దేశంలోని కోటానుకోట్ల మంది ప్రజానీకం ఆకాక్షలకు ప్రతిబింబంగా ఉంటుంది. మరి దాన్ని ఎంతమంది వింటున్నారు. మరెంతమంది అర్ధం చేసుకుంటున్నారు అంటే సమాధానం నిరాశగానే వస్తుంది. రిపబ్లిక్ డేని సెలవు రోజుగా భావించే వారే ఎక్కువ. 


రాజ్యాంగం పట్టదా :


ఈ దేశంలో పేద వాడు, పెద్ద వాడు అందరూ ఒకటే అన్న రాజ్యాంగం మౌలిక సూత్రాలను మరచిపోతున్నారు. చట్టాలకు అతీతం అన్న భావన చాలామందిలో పెరిగింది. అధికారంలో ఉన్న వారు దేన్ని లెక్కచేయని పరిస్థితి వచ్చారు. కులం, మతం ప్రాంతం అంటూ రెచ్చగొట్టే పెడ ధోరణులు పెచ్చుమీరుతున్నాయి. ఉన్న వాడు. లేని వాడు అన్న అంతరాలు బాగా పెరిగాయి. సంపద ఒక్క చోటే చేరుతోని. నానాటికీ పేదవాడు మరింత పేదగా మారుతూంటే, పెద్ద వారు ఇంకా పెరిగిపోతున్నారు. అన్ని విధాలుగా అసమానతలు, అషహనం పెరిగి శాంతి సౌబ్రాత్రుత్వం పూర్తిగా కొరవడిపోయాయి.


ఒక్కమారు ఈ గణతంత్ర వేడుకల నుంచైనా ఆలోచన చేయాలి. ఈ మన రాజ్యాంగ నిర్మాతలు ఇదేనా మన నుంచి కోరుకున్నది. వారి ఇందుకోసమే దేశానికి స్వాతంత్రం తెచ్చింది. మనమంతా  సోదర భావంతో మెలగాలని కోరుకుంటే ఈ విద్వేషాలతో దేశాన్ని అతలాకుతలం చేసే హక్కు ఎవరిచ్చారు. ఇది ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నా దేశం గొప్పది అనుకోవడం కాదు. నేను కూడా గొప్పగా ఉండాలి. రాజ్యాంగ  విలువలు పాటించాలి అనుకోవాలి. అపుడే రిపబ్లిక్ డే వేడుకలకు సార్ధకత.


మరింత సమాచారం తెలుసుకోండి: