ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్వయానా బావ అయిన రామకోటారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపిలో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ముఖ్య పార్టీ నేతలు వలసలు వెళ్లడంపై ఉత్కంఠ నెలకొంది.  టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల్లో కొంత మంది నేతలు ఏ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారో అన్న విషయం సస్పెన్స్ గా ఉంది.  గతంలో అధికార పార్టీలోకి వైసీపీ నేతలు వరుసగా జంప్ అయిన విషయం తెలిసిందే.  ఈ మద్య జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ తో టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ అవుతున్నారు. 

ఈ నేపథ్యంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్వయానా బావ అయిన రామకోటారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి జంప్ కావడం ఏపిలో కలకలం రేపుతుంది. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కొద్దిరోజుల క్రితం రామకోటారెడ్డి ఇంటికి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లి చర్చలు జరిపినట్లు సమాచారం. 

రామకోట సుబ్బారెడ్డి వైసీపీలో చేరడానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ప్రధాన పాత్ర పోషించారనే ప్రచారం జరుగుతోంది.  కొంత కాలంగా ఓ ఇంటికి సంబంధిం చిన గొడవ కారణంగా బావబావమరుదుల మధ్య గొడవ జరిగిందని జిల్లాలో చర్చ నడుస్తోంది.  ఇక కడప జిల్లా ఇన్ చార్జి మంత్రిగా సోమిరెడ్డి కొనసాగుతున్నారు.  ఈ నేపథ్యంలో సొంత బావ వైసీపీ తీర్థం పుచ్చుకోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. రామకోటారెడ్డితో పాటు ఆయన కుమారులను కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ఇక రామకోటారెడ్డి సోమిరెడ్డి అక్కను వివాహం చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: