ఆంధ్రప్రదేశ్ లో ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక జేఏసీ మళ్లీ సమ్మె సైరన్ మోగించింది.  తమ డిమాండ్లు నెరవేర్చని పక్షాన రివదిక సమ్మే చేస్తామని అంటున్నారు. వాస్తవానికి సంక్రాంతి పండుగ ముందే సమ్మ చేయాలని అనుకున్నప్పటికీ  పండుగ తర్వాత డిమాండ్లపై సీఎంతో చర్చిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో సమ్మె వాయిదా వేసుకుంది. వేతన సవరణపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎండీ సురేశ్ బాబు, ఇతర ఉన్నతాధికారులతో నిన్న జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈరోజు విజయవాడలో సమావేశమైన ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస.. ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు దిగాలని పిలుపునిచ్చింది.


బంద్ లో భాగంగా 52,000 మంది ఆర్టీసి సిబ్బంది విధులకు హాజరుకాబోరని ఐకాస స్పష్టం చేసింది.  పండుగ ముందు తమకు హామీ ఇచ్చినప్పటికీ పండుగ తర్వాత జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటు వారు తెలిపారు. మొత్తం 13 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడం తో సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని యూనియన్ నేతలు తెలిపారు. తమ ప్రదానమైన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వేతన సవరణ అమలు చేయాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలనే తదితర డిమాండ్లతో జేఏసీ సమ్మెకు దిగుతోంది.


ఆర్టీసీలో 2017, ఏప్రిల్ 1న దాదాపు 52 వేల మంది సిబ్బందికి వేతన సవరణ చేయాల్సి ఉంది. అయితే దీన్ని జాప్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం చివరికి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఒత్తిడితో 19 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంది. తన సవరణపై గుర్తింపు కార్మిక సంఘం, యాజమాన్యం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీ అంత భారం భరించలేదని సంస్థ ఎండీ సురేంద్రబాబు స్పష్టం చేశారు.దీంతో ఆర్టీసీలోని 8 కార్మిక సంఘాలు ఏకమై సమ్మెకు సిద్ధమవుతున్నాయి. వారికి అధికారుల సంఘం(ఓస్వా) కూడా మద్దతు పలకడంతో వాతావరణం మరింత వేడెక్కింది.  దీంతో కార్మిక సంఘాల ఐకాస వచ్చే నెల 6 నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: