ఈసారి ఎన్నికలు  మామూలుగా ఉండవు. అందులోనూ భారత దేశంలోని ఓటర్ల పరిణితి మామూలు విషయం కానే కాదు. దేవత అనుకునే ఇందిరాగాంధీనే ఓడించి ఇంటికి పంపించారు. ఇక ఏపీలో దేవుడు అనుకున్న అన్న గారికి కూడా ఓటమి తప్పలేదు. వారు ఏమీ తెలియనట్లుగానే ఉంటూ అన్నీ గమనిస్తారు. సరైన సమయంలో షాకులు తినిపిస్తారు.


జగన్ కె చాన్స్ :


వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఓ రేంజిలో రాజకీయ యుధ్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో మారు అధికారాన్ని నిలబెట్టుకుందామని చంద్రబాబు, ఈసారి ఎలాగైనా అధికారంలోని రావాలని జగన్ మంచి పట్టుదల మీద ఉన్నారు. మధ్యలో పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఉంది. ఏది ఏమైనా ఇప్పటివరకూ చూసుకుంటే ఏపీలో పోరు మాత్రం టీడీపీ, వైసీపీల మధ్య భీకరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో  చూసుకుంటే జగన్ పార్టీకే కాస్త ఎడ్జ్ ఉన్నట్లుగా ఇప్పటికే సర్వేలు తేల్చాయి. దీంతో జాతీయ స్థాయిలో ఇపుడు ఎవరు కూటములు కట్టినా కూడా రేపటి రోజున జగన్ ఎంపీలే కేంద్రంలో ఏర్పడబోయే  కొత్త సర్కార్ ఎర్పాటు లో కీలకం అవుతారని అంటున్నారు.


సగానికి పైగా :


ఇక ఏపీలో ఉన్న మొత్తం 25 ఎంపీ సీట్లకు గాను సగానికి పైగా సీట్లను వైసీపీ గెలుచుకుంటుందని జాతీయ సర్వేలు తేల్చాయి. జగన్ సైతం మొత్తం పదమూడు జిల్లాలో పాదయాత్ర చేసి మొత్తం వాతావరణాన్ని తనకు అనుకూలంగా చేసుకున్నారు. ఇక ఇపుడు చూస్తూంటే ఏపీలో రాజకీయం జంపింగులన్నీ కూడా వైసెపీ వైపుగానే సాగుతున్నాయి. మరో వైపు జనాకర్షణ పధకాలతో టీడీపె సర్కార్ జనంలోకి వస్తోందంటే దాని అర్ధం చివరి ప్రయత్నాలు చేయడమేనని విశ్లేషలుకు భావిస్తున్నారు. ఏది ఎలాగున్నా జగన్ పార్టీకి మెజారిటీ ఎంపీ సీట్లు దక్కుతాయని అంతా భావిస్తున్నారు.


ఆ రెండు పార్టీలు కూడా :


ఇక పొరుగున ఉన్న తెలంగాణ, ఒడిషాలో కూడ విపక్ష కూటములే అధికారంలో ఉన్నాయి. టీయారెస్, బిజూ జనదాదళ్ పార్టీలు రెండూ కూడా ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థ వైఖరిని అవలంబిస్తున్నాయి. ఈ మూడు పార్టీలకు కలుపుకుని మొత్తం ఉన్న 63 ఎంపీ సీట్లలో 50 వరకూ వస్తాయని అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే ఈ మూడు పార్టీల నాయకులే రేపటి డిల్లీ రాజకీయాల్లో కీలకం అవుతారు. ఎక్కువ సీట్లు ఉన్న జగన్ పార్టీ మరింతగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతుంది. అందుకే డిల్లీలోని రాజకీయ పండితులు ఇపుడు ర్యాలీ చేస్తున్న విపక్ష పార్టీల కంటే కూడా తటస్థ పార్టీలైన వైసీపీ, టీయారెస్, బిజూ జనదాదళ్ పార్టీల వైపే ఓ కన్నేసి ఉంచారు.  మొత్తం సీన్ ని మార్చే శక్తి  వీరి వద్దనే ఉందని తలపండిన రాజకీయ పెద్దలు భావిస్తున్నారు. మరి చూడాలి. రేపటి హస్తిన రాజకీయంలో హీరోలెవరో.



మరింత సమాచారం తెలుసుకోండి: