ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డి  కొత్త ఎత్తుగడ మొదలెపెట్టింది. తటస్తులకు గాలం వేయటంలో భాగంగా పార్టీ తరపున అన్న పిలుపు అనే కార్యక్రమం ద్వారా వారికి దగ్గర అవ్వాలని జగన్ వ్యూహం రచిస్తున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలు, స్ధానిక సమస్యలు, వాటి పరిష్కారాలు తదితరాలను సూచించాల్సిందిగా జగన్ కోరనున్నారు. జగన్ తరపున గ్రామస్ధాయిలో పనిచేస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

 

గ్రామస్ధాయి కావచ్చు లేదా మండల స్ధాయి  కావచ్చు  ప్రశాంత్ కిషోర్ గుర్తించిన తటస్తులకు జగన్ నేరుగా లేఖలు రాయనున్నారు. స్ధానిక సమస్యల పరిష్కారంలో కావచ్చు, లేదా తామున్న ప్రాంతాల్లోని ప్రజలనపై ప్రభావం చూపగలగటం పట్ల తాను సంతోషంగా ఉన్నట్లు జగన్ తన లేఖల్లో ప్రస్తావించనున్నట్లు సమాచారం. పాదయాత్ర సందర్భంగా తాను గమనించిన సమస్యలు, అంశాలను ఆయా ప్రాంతాల్లో ప్రభావితం చూపగల తటస్తులతో నేరుగా జగనే టచ్ లోకి వెళ్ళాలన్నది జగన్ వ్యూహం. మొత్తం కార్యక్రమంలో తటస్తులను ఆకట్టుకోవటం, వారిని వైసిపివైపు మళ్ళించటంతో పాటు పలువురిని వైసిపి వైపు ప్రభావితం చేయించగలగటమే జగన్ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

 

జగన్ అంచనా ప్రకారం రాష్ట్రంలో సుమారు 14 శాతం ఓటర్లు తటస్తులుగా ఉన్నారట.  12 శాతం ఓటర్లంటే మామూలు విషయం కాదు. ఇఫ్పటి వరకు లోక్ సభ ఎన్నికలపై జాతీయ మీడియా నిర్వహించిన అనేక సర్వేల్లో వైసిపి, టిడిపి మధ్య వ్యత్యాసం కూడా సుమారు 10 శాతముంది. వైసిపి వైపు 43 శాతం జనాలు మొగ్గు చూపుతుంటే, టిడిపి వైపు 33 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. బిజెపి, జనసేన, కాంగ్రెస్ తదితరాల విషయంలో ఓ పది శాతంమంది మొగ్గు చూపుతున్నా మిగిలిన వారిని తటస్తులుగా భావించాల్సుంటుంది. 14 శాతం తటస్తులంటే ప్రభుత్వాలనే మార్చేయగలిగిన శాతం. అందుకనే తటస్తులను కూడా వైసిపి వైపు మళ్ళించాలన్న ఆలోచనతోనే జగన్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ గుర్తించిన తటస్తులకు జగన్ లేఖలు సిద్ధం చేసుకుంటున్నారట. ప్రశాంత్ గుర్తించిన వారిలో కనీసం సగంమందైనా వైసిపి వైపు మొగ్గితే జగన్ వ్యూహం ఫలించినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: