2019 ఎన్నికలు దగ్గర పడుతుండటం తో జాతీయ ఛానెల్స్ ఇప్పటికే పలు మార్లు సర్వేలు నిర్వహించాయి . అయితే లేటెస్ట్ గా ఇప్పడూ రిపబ్లిక్ టీవీ సర్వే ఫలితాలను బయట పెట్టింది. దాని ప్రకారం.. జాతీయ స్థాయిలో కాస్తంత హంగ్ తరహా పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి.బీజేపీతో సహా ఎన్డీయే కూటమిలోని పార్టీలు 233 సీట్లను సాధించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ సహా యూపీఏ కూటమిలోని అభ్యర్థులు 167 సీట్లను సాధిస్తాయని అంచనా వేసింది ఈ సర్వే.

Image result for jagan

ఇతర పార్టీలు నూటా నలభై మూడు సీట్లను సాధిస్తాయని రిపబ్లిక్ సర్వే పేర్కొంది ఈ ఇతర పార్టీలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అయ్యే అవకాశాలున్నాయి. ఇతర పార్టీల్లో ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేడీలు ప్రముఖంగా నిలవబోతున్నాయి. ఎస్పీ-బీఎస్పీలు యూపీలో కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీలు 51 సీట్లను సాధించవచ్చని ఈ సర్వే పేర్కొంది.

Image result for jagan

ఏపీ విషయానికి వస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభజనం ఉంటుందని రిపబ్లిక్ టీవీ సర్వే అంచనా వేసింది. 19 ఎంపీ సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గవచ్చని, తెలుగుదేశం పార్టీ ఆరు ఎంపీ సీట్లకు పరిమితం అవుతుందని ఈ సర్వేలో పేర్కొన్నారు. ఇలా ప్రతి జాతీయ సర్వేలు జగన్ పార్టీ కి అనుకూలంగా రావటం తో టీడీపీ లో ఎక్కడో తెలియని భయం మాత్రం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: