ఆంధ్ర ప్రదేశ్ లో 2019 లో వైసీపీ అధికారం లోకి రాబోతుందని ఇప్పటికే పలు సర్వేలు ఘంటా పధంగా చెబుతున్నాయి. అయితే ఈ సర్వేలు ను నమ్మి రిలాక్స్ అయితే మొదటికే మోసం వస్తుంది ఎందుకంటే 2014 లో కూడా అలాగే వైసీపీ అతి విశ్వాసానికి పోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది ఎంపీ సీట్లను నెగ్గే అవకాశం ఉందని రిపబ్లిక్ టీవీ సర్వే చెబుతోంది. అయితే వైకాపా ఇంత అన్ని ఎంపీ సీట్లలో తగిన  అభ్యర్థులను కూడా రెడీ చేసుకున్నట్టుగా కనిపించడం లేదు. అభ్యర్థుల ప్రకటన ఇంకా తెగడంలేదు.

Image result for jagan

వైకాపాకు అనుకూలత ఉన్న అనంతపురం, కర్నూలు వంటి ఎంపీ సీట్లలోనే అభ్యర్థుల  గురించి అధికారిక ప్రకటన జరగకపోవడం గమనించాల్సిన అంశం. నంద్యాల కూడా ఇదే తీరున ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థులతో పోలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులు చాలా వీక్ గా కనిపిస్తున్నారు. ఈ విషయాన్ని వైకాపా వాళ్లు ఒప్పుకోకపోయినా నిష్టూరమైన సత్యం. తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎంపీలు చాలా శక్తియుక్తులతో కనిపిస్తున్నారు.

వైఎస్సార్సీపీ సర్వేల మత్తులో మునుగుతోందా?!

ఆర్థికంగా తెలుగుదేశం సిట్టింగ్ ఎంపీలను కొట్టడం వైకాపా అభ్యర్థులకు సాధ్యం అయ్యే పనేకాదు. వేవ్ ఉంటే తప్ప పంతొమ్మిది ఎంపీ సీట్లను నెగ్గడం సాధ్యంకాదు. అయితే సర్వేలు చెప్పాయి.. ఇక గెలిచేస్తున్నాం.. అనే భావన వైసీపీలో కనిపిస్తూ ఉంది. ఈ సర్వేల మత్తులో మనుగడం వైకాపాకు కొత్త ఏమీకాదు. ఎన్నికలు అప్పుడే అయిపోలేదు. ఇక నుంచినే అసలు కథ మొదలు కాబోతోంది. మరో ఆరువారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత నెలరోజుల పాటు.. తీవ్రమైన పోరాటం ఉంటుంది. ఇలాంటి తరుణంలో రిపబ్లిక్ టీవీ చెప్పిందనో, ఇండియాటుడే చెప్పిందనో.. గెలిచేస్తున్నాం, గెలిచేశాం.. అనే భావనలోకి వెళ్తే మాత్రం కథ మళ్లీ మొదటకు వచ్చినట్టే!

మరింత సమాచారం తెలుసుకోండి: