మామూలుగానే ప్రతీ సంవత్సరం బడ్జెట్ రూపొందించిన తరువాత ప్రతిపక్షం దానిని తీవ్రంగా విమర్శించడం జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ ఉన్న నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా అందుకు ఏ మాత్రం మినహాయింపు కాదు అన్న విషయం మాత్రం స్పష్టం. అయితే 2018-2019 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ యొక్క అనేక మంది రాజకీయ ఉద్ధండుల అభిప్రాయాల గురించి కొంచెం విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
Image result for budget india

బడ్జెట్ బడుగు వర్గాలను దృష్టిలో పెట్టుకొని చేస్తే ఆధునీకరణ లేదని, టెక్నాలజీ పైన దృష్టి సారిస్తే బడుగులంటే చిన్న చూపు చూశారని అంటుంటారు. కాబట్టి సమతూకమైన బడ్జెట్ రూపొందించడం ముఖ్యం. గత ఏడాది మాత్రం బడ్జెట్ మిశ్రమ అభిప్రాయాలను ఎదుర్కొంది. బీజేపీ మరియు మోడీ ఇది గ్రామీణ ప్రజలకు చేయూతను ఇచ్చే విధంగా ఉంది అని చెప్పారు. ఇకపోతే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం దీని లెక్కల్లో ఏదో అర్థంకాని మతలబు, తప్పులు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. సీపీఐ జెనరల్ సెక్రటేరీ సీతారాం ఇది గ్రౌండ్ లెవెల్ లో పనిచేయదని వ్యాఖ్యానించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబునాయుడు స్పెషల్ స్టేటస్ మరియు ప్యాకేజీలను విస్మరించడంతో బడ్జెట్ పై తీవ్రం నిరసన వ్యక్తం చేశాడు. 
Related image

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గతేడాది బడ్జెట్ ను ప్రశంసించారు. రైతులు మరియు ఆరోగ్యం పెద్ద పీటగా వేసిన ఈ బడ్జెట్ సమతూకంగా ఉందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్, అరవింద్ కేజ్రీవాల్ మాత్రం మధ్యతరగతి వారికి వ్యాపారులకు కేంద్రం మొండి చేయి చూపించింది అన్నారు. మాజీ ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం, జైట్లీ పన్ను కట్టే వారిని మెప్పించడం లో విఫలం అయ్యారని అన్నారు. 
Image result for budget india

ఇక స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే జాతీయ స్టాక్ మార్కెట్ సూచిక నిఫ్టీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత స్వల్పంగా పడిపోయింది. ఇది విమర్శాకారులకు కొంచెం ఉత్సాహాన్ని నింపింది. అయితే స్టాక్ మార్కెట్ పడిపోవడానికి అంతర్జాతీయ మార్కెట్ లోని స్వల్ప మార్పులు మాత్రమే కారణం అని కేంద్రం చెప్పుకొచ్చింది. ఏది ఎలా ఉన్నా ఈ సంవత్సరం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ పైన తమదైన శైలిలో స్పందించేందుకు ఎవరికి వారు తమదైన శైలిలో సన్నద్ధం అవుతున్నారనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: