ఏపీ రాజకీయాల్లో బీసీల పాత్ర చాలా కీలకం. జనాభా పరంగా వారిది పెద్ద పీట, భిన్న కులాలు, ఉప కులాలుగా చీలి ఉండడం వల్ల మొత్తం బీసీలుగా ఉమ్మడి పోరుకు సిధ్ధం కాలేకపోతున్నారు. వారి అనైక్యత రాజకీయ పార్టీలకు ఆయుధంగా మారుతోంది. పేరుకు బీసీలు అంటున్నా అసలైన అధికారాలు మాత్రం అగ్ర కులాల చేతుల్లోనే ఉన్నాయి. మరి బీసీలు షాకిస్తారా.


మారుతున్న వైఖరి :


ఏపీలో చూసుకుంటే గతంలో కాకుండా బీసీలు ఇపుడు తమ వైఖరిని మార్చుకుంటున్నారు. ఒకే పార్టీకి గుత్తమొత్తంగా ఓట్లు వేసి వారు ఇచ్చే సీట్లే వరప్రసాదమనుకునే ధోరణి మారుతోంది ఏపీ జనాభాలో చూసుకుంటే 52 శాతం పైగా ఉన్న బీసీలు ఇపుడు అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండింటిలోనూ ఆప్షన్లను వెతుక్కుంటున్నారు. అన్న నందమూరి పార్టీని పెట్టిన నాటి నుంచి నిన్నా మొన్నటి వరకూ బీసీలు టీడీపీకి దన్నుగా ఉన్న మాట నిజమే కానీ ఈసారి మాత్రం వారు ఒకే పార్టీకి జై కొడతాంటే నమ్మడం కష్తమే.


వైసీపీ వైపు :


ఇక ఏపీలో మరో ప్రధానమైన పార్టీగా ఉన వైసీపీ వైపు బీసీలు చూస్తున్నరు. తగిన మొత్తంలో సీట్లు ఇస్తామ‌ని చెప్పడమే కాదు. కాపు రిజర్వేషన్ల పైన కూడా జగన్ కుండబద్దలు కొట్టడం నమ్మశక్యమయ్యే విధంగా హామీలు ఇవ్వడం, వైఎస్ జమానాలో బీసీలకు చేకూరిన  లబ్ది, జగన్ ఇస్తున్న హామీలు ఇవన్నీ కూడా వైసీపీ వైపుగా నడిపిస్తున్నాయి. మొత్తానికి మొత్తం కాకపోయినా బీసీలో చాలా వరకూ ఇపుడు వైసీపీ కూడా ఓట్లు తీసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.


జయహో బీసీ ఒకేనా :


ఈ నేపధ్యంలో ఈ రోజు టీడీపీ రాజమహేంద్రవరంలో పెడుతున్న జయహో  బీసీ సభపై అందరి కళ్ళు ఉన్నాయి. బీసీలను తన వైపుకు తిప్పుకునేందుకు టీడీపీ ఈ సభ నిర్వహిస్తోందన్నది తెలిసిందే.  పైగా కాపులు ప్రాబల్యం ఉందనుకున్న ఉభయగోదావరి జిల్లాలో బీసీలను టీడీపీకి మద్దతుగా ఉంచుకునేందుకు ఈ సభ నిర్వహిస్తున్నారు. రెండు లక్షల మంది వరకూ బీసీ కులస్తులు పాలుపంచుకునే ఈ సభలో చంద్రబాబు వరాల జల్లు కురిపిస్తారని చెబుతున్నారు. మరి ఈ సభ టీడీపీకి ఎంతవరకు కలసివస్తుందన్నది కూడా చూడాలి. మొత్తానికి ముందే చెప్పుకున్నట్లుగా బీసీల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. వారు ఇదివరకులా ఒకే పార్టీ వైపు లేరు. ఇకపై ఉండరు కూడా, అయినా టీడీపీ తన వంతు ప్రయత్నాలు చేసుకుంటోంది.  ఆ పార్టీ ఇచ్చే హామీలు, బాబు కురిపించే వరాల బట్టి కొంత మార్పు వస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: