ఏపీ రాజకీయాలను శాసించి అధికారంలోకి రావాలనుకుంటున్న వైసీపీ ఇపుడు కీలకమైన ఘట్టంలో నిలిచి ఉంది. రానున్న రెండు నెలలూ ఆ పార్టీకి అగ్నిపరీక్షగానే చెప్పాలి. ఇప్పటి నుంచి జనం ప్రతి రాజకీయ పరిణామాన్ని నిశితంగా గమనిస్తారు. వాటీ బట్టే వారు తమ తీర్పుని వెలువరిస్తారు.


అసెంబ్లీ ఆయుధమే:


వైసీపీ అధినేత దాదాపు రెండేళ్ళ క్రితం అసెంబ్లీ బాయ్ కాట్ ప్రకటించారు. నాటి పరిస్థితుల్లో ఆయన నిర్ణయం సబబే అయినా తరువాత మారిన రాజకీయ వాతావ‌రణంలో జగన్ పలు విమర్శలు ఎదుర్కొన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను 23 మందిని తీసుకుని అందులో కొందరిని మంత్రులుగా చేశారని జగన్ ప్రధాన అభియోగం. వారిపైన‌ వేటు వేస్తే అసెంబ్లీకి సిధ్ధమని ప్రకటించారు. బాగానే ఉంది. దానికి ఆయన రెండేళ్ళ పాటు టైం ఇచ్చారు. అధికారం పార్టీ ఆలాగే ఉంది. వారితోనే ప్రభుత్వం నడుపుతోంది. మరి జగన్ ఇపుడేం చేయాలి.


అసెంబ్లీకి వెళ్ళాలి :


ఈ టైంలో జగన్ అసెంబ్లీకి వెళ్ళడమే కరెక్ట్ అంటున్నారు తలపండిన రాజకీయ పండితులు కూడా. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహిరిస్తే నిగ్గదీసే బాధ్యత  ప్రతిపక్షానిది. అయినా సర్కార్ మొండిగా ఉంటే జనమే ఆ సంగతి చూసుకుంటారు. అంతే తప్ప విపక్షం మరింత మొండిగా ఉండి అసలు విధులను పక్కన పెట్టరాదు. వైసీపీ విషయంలో జరుగుతున్నది అదే. జగన్  పాదయాత్ర కూడా ముగిసింది. ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ చివరి విడత సెషన్స్. దానికి జగన్ హాజరు అయితే ఆ పార్టీ మైలేజ్ అమాంతం పెరుగుతుంది. 


సర్కార్ ని నిగ్గదీయాలి :


గత రెండేళ్ళుగా పాదయాత్రలో తాను చూసినవి జగన్ ఈ చివరి సభలో నిగ్గదీయాలి. అలాగే  ఫిరాయింపు మంత్రులను తొలగించాలని సభా వేదిక మీదనే డిమాండ్ చేసి జనం ద్రుష్టిలో టీడీపీని దోషిగా నిలబెట్టాలి. వినకపోతే జనమే ఆ పార్టీకి గుణపాఠం చెబుతారు. ఇక అసెంబ్లీలో గొంతు నొక్కుతున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. అలా చేస్తే ఆ చెడ్డ పేరు సర్కార్ కే వస్తుంది. కానీ అసెంబ్లీనే బాయ్ కాట్ చేస్తే మాత్రం ఎన్నికల వేళ వైసీపీకి అది మైనస్ అవుతుందై అంటున్నారు. మరి జగన్ ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. స్పీకర్ కోడెల మాత్రం తాను వైసీపీ వారిని అసెంబ్లీకి రమ్మని కోరుతున్నానని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: