రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో కొందరు యువకులు సర్వేల పేర్లతో విస్తృతంగా తిరుగుతున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తాజాగా కొందరు యువకులు విజయనగరం జిల్లాలో తిరుగుతున్న వైనం సంచలనంగా మారింది. ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై ఫీడ్ బ్యాక్ కోసమంటూ కొందరు యువకులు ట్యాబులు పట్టుకుని ఇల్లులు తిరుగుతున్నారు. వారితో ఏమాత్రం అజాగ్రత్తగా మాట్లాడిన తర్వాత లబోదిబో మనాల్సిందే జనాలు. ఎందుకంటే, రేషన్ కార్డు కట్టయిపోతోంది. లేదా ఫించన్లు ఆగిపోతున్నాయి. అదీకాకపోతే ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతవుతున్నాయి. ఇంతకీ ఈ సర్వేల గోల ఏమిటనుకుంటున్నారా ?

 Related image

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశంపార్టీనే వందలాదిమంది యువకులను రంగంలోకి దింపింది. వారిని గ్రామాల వారీగా విడదీసి సర్వేల పేరుతో ఇంటింటికి తిప్పుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, స్ధానిక ప్రజాప్రతినిధులపై అభిప్రాయాలు, చంద్రబాబునాయుడు పనితీరు తదితరాలపై ప్రశ్నలు వేస్తున్నారు. ప్రశ్నలు వేసే ముందే తాము సర్వే చేసేందుకు ప్రభుత్వం తరపున వచ్చామని చెబుతూ ఇంటి నెంబర్, ఓటర్ కార్డుల వివరాలు, రేషన్ కార్డుల వివరాలు, పొందుతున్న సంక్షేమ పథకాల వివరాలు అన్నింటి వివరాలు తీసుకుంటున్నారు.

 Image result for voters list in ap

తమకు అవసరమైన ఫీడ్ బ్యాక్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. కొంత కాలం తర్వాత చూసుకుంటే అప్పటి వరకూ అందుతున్న సంక్షేమ పథకాల్లో ఏదో ఒకదానికి కోత పడుతుంది. అలాగే ఓటర్ జాబితాలో ఓటు కూడా గల్లంతవుతోంది. ఇదంతా దేనికి చేస్తున్నారంటే టిడిపికి మద్దతిచ్చే వారు, తెలుగుదేశంపార్టీని వ్యతిరేకించే వారు ఎవరు ? అన్న విషయం తెలుసుకునేందుకే సర్వేల పేరుతో టిడిపియే నాటకాలాడుతోందని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడినా, పొరపాటున వైసిపికి అనుకూలంగా మాట్లాడినా అన్నీ బంద్. విజయనగరం జిల్లాలో ఇపుడీ అంశమే కలకలం రేపుతోంది. ఇదే పద్దతిని గతంలో చాలా జిల్లాలో టిడిపి అవలంభించింది.

Image result for voters list in ap

 వైసిపికి పడుతుందని అనుకుంటున్న ఓట్లను టిడిపి నేతలే ప్రభుత్వ యంత్రాంగం మద్దతుతో ఓటర్లజాబితాల నుండి తొలగించేస్తున్నట్లు వైసిపి నేతలు మండిపడుతున్నారు. ఈ పద్దతిలో ఇప్పటికే సుమారుగా 40 లక్షల ఓట్లను తొలగించారంటూ వైసిపి మండిపోతోంది. ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదులు చేసినా ఉపయోగం కనబడలేదని వైసిపి నేతలు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి సర్వేల పేరుతో ఎవరైనా తమ ఇళ్ళకు వచ్చినపుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా జనాలే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా  పని చేసిన ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం చెప్పటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: