ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అఖిలపక్ష సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో అఖిలపక్షానికి సంబంధించిన అంశాల గురించి ఉండవల్లి మాట్లాడుతూ అనేక విషయాలను మీడియాతో పంచుకున్నారు.

Image result for undavalli arun kumar

ఈ క్రమంలో ఈ సమావేశానికి టిడిపి వస్తే వైసిపి పార్టీ హాజరు కాదని ఈ విషయం వైసీపీ పార్టీకి చెందిన నేతలే తేల్చి చెప్పారని అసలు ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి రావడానికి టీడీపీ తీసుకున్న నిర్ణయాలే అని వైసిపి పార్టీకి చెందిన నేతలు కామెంట్లు చేశారని ఉండవల్లి పేర్కొన్నారు.

Image result for ysr congress party office rooms

అయితే మరోపక్క తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ సమావేశానికి హాజరుకావాలని చంద్రబాబు కూడా డిసైడ్ అయ్యారట. ఈ క్ర‌మంలో టీడీపీ త‌రుపున మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు హాజరుకానున్నారని స‌మాచారం.

Image result for undavalli arun kumar

ఈ సమావేశానికి వైసీపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ హాజరువుతున్నాయని ఉండవల్లి ప్రకటించారు. ఇక ఈ స‌మావేశంలో కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయాలన్న విషయాన్ని చ‌ర్చిచ‌నున్నార‌ని, రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల కోసమే ఈ స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని ఉండ‌వ‌ల్లి తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: