అవును చంద్రబాబునాయుడు మాయాజాలాన్ని కియాజాలమనే చెప్పాలి. ఎందుకంటే, చంద్రబాబు మాయాజాలానికి తాజాగా వేదికైంది కియా మోటార్స్ ఉత్పత్తి ప్లాంటు కాబట్టి. అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ కంపెనీ ఉత్పత్తి చేసిన మొదటి కారును చంద్రబాబు మంగళవారం రన్ చేసిన విషయం అందరూ చూసిందే. ఇక్కడే చంద్రబాబు కియాజాలం బయటపడింది. ఎలాగంటే, కియా మోటార్స్ ఉత్పత్తి ప్లాంటు ఇంకా రెడీనే కాలేదు. కార్ల అసెంబ్లింగ్ కు అవసరమైన రోబోలు సిద్ధం కాలేదు. అందుకు అవసరమైన ప్లాంటు నిర్మాణం ఇంకా సగంలోనే ఉంది. యాజమాన్యం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ప్రకారం 2019 సంవత్సరం చివరకు గానీ ఉత్పత్తి యూనిట్ రెడీ కాదు.

 

అలాంటిది 2019 జనవరిలోనే చంద్రబాబు మొదటికారును ఎలా ట్రయల్ రన్ చేసేశారు. ప్రెస్ రిలీజ్ లో ఒకటి చెప్పిన యాజమాన్యం అందుకు  భిన్నంగా ఎందుకు అంత పెద్ద ఫంక్షన్ పెట్టి నానా హంగామా చేసింది ? ఎందుకంటే, కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకే అన్నది అర్ధమైపోతోంది. ఎందుకంటే, మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేది అనుమానమే. ఒకవేళ అధికారంలోకి రాకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు ఉత్పత్తయిన మొదటి కారును ప్రారంభిస్తారు. ఆ క్రెడిట్ అంతా అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు క్లైం చేసుకుంటారు.

 

అందుకనే ఏదో మాయచేసో లేకపోతే ఒత్తిడి చేసో మొత్తానికి కార్ల ట్రయల్ రన్ ను చంద్రబాబు ప్రారంభించేశారు. నిజానికి చంద్రబాబు తిరిగిన కారు కూడా అనంతపురంలో తయారైంది కాదట. దాదాపు నెల క్రితమే దక్షిణ కొరియా నుండా అనంతపురంకు 10 కార్లను తెప్పించారట. అలా తెప్పించిన కారులోనే చంద్రబాబు కూర్చుని ఆ కారును ఇక్కడే అసెంబ్లింగ్ చేసినట్లు బిల్డప్ ఇచ్చారు. అంటే ఇదంతా కేవలం ఎలక్షన్ స్టంటు మాత్రమే అన్నది అర్ధమైపోతోంది. హోలు మొత్తం మీద గమనించాల్సిందేమిటంటే, చంద్రబాబు ఒత్తిడికి లొంగి కియా యాజమాన్యం కూడా లొంగిపోయి ఫంక్షన్ పెట్టటానికి అంగీకరించటం.


మరింత సమాచారం తెలుసుకోండి: