లగటిపాటి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఎన్నికల్లో సర్వేలు అని చెప్పి ఉన్న పరువును పోగొట్టుకున్నాడు. పెద్ద మేధావి మాదిరిగా ఎనాలిసిస్ చేసిన సర్వే ఫలితాలు పొంతన లేకుండా పోయాయి. అయితే రాబోయే లోకసభ ఎన్నికలకు ముందు తాను తమ ప్రీ పోల్ సర్వే ఫలితాలు చెప్పనని, ఆ ఎన్నికలు జరిగాక తాను తమ సర్వే ఫలితాలు చెబుతానని, అప్పుడు తనవి కరెక్ట్ అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సర్వే ఎందుకు తప్పయిందో కారణాలు చెబుతానని అన్నారు.

నేను చిలుకను కాను

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎందుకు తారుమారు అయ్యాయో, తాను చెప్పిన ఇండిపెండెంట్లు ఎందుకు రెండో స్థానంలో నిలిచారో చెబుతానని అన్నారు. అసలు తాను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రీపోల్ సర్వే ఫలితాలు చెప్పలేదని, తిరుపతిలో మీడియా ప్రతినిధులు అడిగితేనే తాను చెప్పానని, అప్పుడే తనపై విమర్శలు వచ్చాయన్నారు. తాము ఎవరి ప్రోద్బలంతో నడిచే వ్యక్తిని కాదని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సర్వే ఫలితాల వెనుక ఎవరూ లేరని చెప్పారు. తనకు జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, కేసీఆర్‌లతో ఒకటేరకమైన సందర్భాలు ఉన్నాయన్నారు. 

ఎవరి ప్రోద్భలం లేదు

అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పోలింగ్ శాతం చెప్పడానికే రెండు రోజులు ఎందుకు పట్టిందని లగడపాటి ప్రశ్నించారు. అసలు వాటిని పోలింగ్ ముగిసిన తర్వాతే ప్రకటించాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో వచ్చిన అనుమనాలపై ఈసీ నివృత్తి చేయాలని చెప్పారు. మొత్తం ఓట్ల కంటే అధికార పార్టీకి పోలైన ఓట్లు కొన్ని స్థానాల్లో వచ్చాయని, అవి ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో డబ్బు ప్రభావం చూపిందని చెప్పానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విపక్షం మంచి సీట్లు గెలుచుకుందని, నెల రోజుల వ్యవధిలోనే ఇంత తేడానా అన్నారు. తెలంగాణలో పోలింగ్ శాతం పెరగడంపై కొందరిలో అనుమానం ఉందని చెప్పారు. వీవీప్యాట్‌లు లెక్కించాలని చాలామంది అభ్యర్థులు అడిగారని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: