త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాబోయేది హంగ్ ప్రభుత్వమే అని జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. కేంద్రంలో గనుక హంగ్ ప్రభుత్వం వస్తే రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునేందుకు వైసిపికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.  రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వైసిపికి 25కి 25 లోక్ సభ స్ధానాలు వస్తే మన పార్టీనే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తులుండవని జగన్ మరోసారి స్పష్టం చేశారు.

 

విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అంశం ఉత్తరాంధ్రకు చాలా కీలకంగా మారబోతోందన్నారు. తగినన్ని లోక్ సభ సీట్లు గనుక వస్తే రైల్వేజోన్ సాధనకు పోరాటం చేసేందుకు తగిన బలం వస్తుందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో తటస్తుల మద్దతును పార్టీకి మద్దతు కూడగట్టేందుకు అందరినీ కలుస్తానన్నారు. అన్న పిలుపు కార్యక్రమం నిర్వహణపై పార్టీ నేతలతో చర్చించారు. ఆ సందర్భంగానే జగన్ పై వ్యాఖ్యలు చేశారులేండి.

 

వచ్చే ఎన్నికలు పార్టీకి ఎంతో కీలకంగా జగన్ భావించారు. నేతలు, అభ్యర్ధులు, శ్రేణులు అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. అందుబాటులోని నేతలతో వివిధ నియోజకవర్గాలపై జగన్ సమీక్ష చేశారు. వీలైనంత తొందరలో అభ్యర్ధులను ఖరారు చేయటానికి అవసరమైన కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి జాతీయ మీడియా కేంద్రంలో రాబోయే ప్రభుత్వాలపై వెలువరిస్తున్న సర్వేలను జగన్ జాగ్రత్తగానే గమనిస్తున్నట్లు అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: