2019 ఎన్నికలు దగ్గర పడుతుండటం తో చంద్ర బాబు కురిపిస్తున్న వరాల జల్లు చేసి జనాలు నోరెళ్ళ బెడుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో చంద్ర బాబు జనాల గురించి పట్టించుకోకుండా , సంక్షేమ పథకాలు గాలికి వదిలేశారు. ఇపుడేమో ఎన్నికల రెండు , మూడు నెలల ముందు అందరి మీద ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నాడు. చంద్రబాబు తీసుకుంటున్న ఈ నిర్ణయాలను గమనిస్తే ఓ విషయం మాత్రం స్పష్టమవుతోంది. వైఎస్ జగన్ పాదయాత్ర ద్వారా వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంత సానుకూలత వచ్చిందని - ఆ సానుకూలతను తగ్గించి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నదే చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

Image result for jagan and chandra babu

అందులో భాగంగానే వైఎస్ జగన్ ప్రకటించిన హామీలకు అతి దగ్గరగా ఉన్న హామీలను బాబు ప్రకటించినట్లు సమాచారం. పైగా.. పథకాల ప్రకటనలో కూడా బాబు రాజకీయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెంచిన వృద్ధాప్య ఫించన్లను ప్రతీనెల మాదిరిగా మామూలుగా ఇవ్వరట. భోజనం పెట్టి మరీ ఇస్తారట. ఇంత హడావుడి చేయడం వెనుక కారణం లేకపోలేదు.

Image result for jagan and chandra babu

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఫించన్లు పొందేవారంతా తమకు చంద్రబాబు భోజనం పెట్టి మరీ ఫించన్లు ఇచ్చాడనే ఓ సానుకూల అభిప్రాయానికి రావడమే దీని ఉద్దేశంగా తెలుస్తోంది. డ్వాక్రా మహిళలకు ప్రకటించిన పసుపు-కుంకుమ పథకంలో కూడా చంద్రబాబు రాజకీయం స్పష్టంగా తెలుస్తుందనే వాదనా ఉంది. ఈ పథకంలో భాగంగా ప్రకటించిన పది వేల రూపాయలను ఒకే విడతలో ఇస్తే ఎన్నికల నాటికి అంత ప్రభావం ఉండదని.. అదే మూడు విడతలుగా ఇస్తే.. మూడో విడత చెక్కు తీసుకునే సమయానికి ఎన్నికలు అతి త్వరలో జరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఆ చెక్కులు తీసుకున్న మహిళలు ఎన్నికల్లో తమ పార్టీకే ఓటేస్తారన్న వ్యూహంలో భాగంగానే మూడు విడతల్లో చెక్కులను పంపిణీ చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: