జగన్ ఇప్పటికే చాలా పథకాలు ప్రకటించారు. పెన్షన్స్ అని, రైతుల లకు పెట్టుబడి సాయంగా నగదు ను బదిలీ చేయడం ఇవన్ని చెప్పాడు. దానితో పాటు గ్రామ సెక్రటేరియట్ అని ఒక కొత్త కాన్సెప్ట్ ను తీసుకొస్తున్నాడు. నిజంగా దీనిని  గురించి అమలు చేస్తే  రాష్ట్రం లోనే కాదు దేశం కూడా ఒక గేమ్ చేంజర్ అవుతుందని చెప్పాలి. తటస్తులతోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన చర్చా కార్యక్రమాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఈ సందర్భంగా జగన్ రాజకీయ విమర్శల గురించి కాకుండా.. విధానపరమైన అంశాల గురించి మాట్లాడటం ఆసక్తిదాయకం. తాము వస్తే పాలన విధానంలో తీసుకురాబోయే మార్పుల గురించి జగన్ మాట్లాడారు. అందులోనూ గ్రామస్థాయిలో తీవ్ర విమర్శల పాలవుతున్న జన్మభూమి కమిటీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దందాలకు విరుద్ధమైన విధానాలను తీసుకొస్తానని జగన్ అంటుండటం విశేషం.

Image result for jagan

అటు యువతకు ఉపాధి కల్పించేలా.. ఇటు గ్రామస్థాయిలో అధికార పార్టీల కార్యకర్తలకు చెక్ పెట్టేలా ఉంది జగన్ చెబుతున్న విధానం. గ్రామ సచివాలయ విధానంతో ముందుకు వెళ్తామని జగన్ అంటున్నాడు. గ్రామ వాలంటీర్లను నియమించి ప్రతి ఊరిలోనూ గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తాం. అదే గ్రామానికి చెందిన పదిమంది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలిస్తాం. వారిని గ్రామ సచివాలయంలో నియమిస్తాం. ఊరిలో పెన్షన్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, నవరత్నాలకు సంబంధించిన అంశాలలో సహాయం కావాలన్నా, ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్.. మరేది కావాలన్నా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు.

Image result for jagan

ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే ఎవరి సిఫార్సు లేకుండా మంజూరు చేస్తాం. దీన్ని మరో అడుగు ముందుకు తీసుకుపోయే దిశగా ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను నియమిస్తాం. గ్రామ వాలంటీర్గా సేవా దృక్పథం కలిగి చదువుకున్న వ్యక్తులను (మహిళలు గానీ పురుషులు గానీ) నెలకు రూ.ఐదువేల చొప్పున ఇచ్చి నియమిస్తాం. ఆ యాభై ఇళ్లకు సంబంధించిన పూర్తి బాధ్యతంతా ఆ వాలంటీర్ చూస్తారు. ఈ వాలంటీర్ గ్రామ సచివాలయంతో అనుసంధానమై పనిచేస్తారు. రేషన్ బియ్యం కోసం ఎక్కడికో పోవాల్సిన పనిలేదు. ఇంటి వద్దకే వస్తాయి. గ్రామ వాలంటీరే డోర్ డెలివరీ చేస్తారు. బియ్యం మొదలుకుని పెన్షన్, అమ్మఒడి వరకూ అన్నీ వారే చూస్తారు. అని జగన్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: