ప్రజా సంకల్ప పాదయాత్ర తో వైసీపీ పార్టీ గ్రాఫ్ ను రాష్ట్రంలోనే కాక జాతీయ స్థాయిలోనూ పెంచేశారు వైసీపీ అధినేత జగన్. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాలలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. తాజాగా ఇటీవల అన్న పిలుస్తున్నాడు అన్న కార్యక్రమాన్ని నిర్వహించిన జగన్ ఆ సమావేశంలో రాబోయే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏర్పడబోయే భారతీయ రాజకీయ ముఖచిత్రాన్ని గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఇటు ఏపీ రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.

Related image

త్వరలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రధాన పార్టీలు ఏవీ కూడా స్పష్టమైన మెజారిటీతో రావని ప్రస్తుత పరిస్థితుల బట్టి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అంటే కచ్చితంగా ఏదో ఒక పార్టీ మద్దతు ఉండాలి ఇదంతా మన మంచికే అని ఖచ్చితంగా కేంద్రంలో హాంగ్ ఏర్పడుతుందని అప్పుడు ఎవరైనా సరే తమ వద్దకే రావాలని అన్నారు.

Image result for anna pilusthunnadu meeting lotuspand

అందుకుగాను రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు గెలిచి పెట్టుకోవాలని, అప్పుడే తమ మాట నెగ్గుతుందని, ఢిల్లీ పార్టీలు తమ ముందు మోకరిల్లుతాయని, మనమే కింగ్ మేకర్ అవుతామని అంటున్నారు.

Image result for anna pilusthunadu meeting jagan

ఎన్నికల ముందు ఎవరికీ మద్దతిచ్చేది లేదన్న ఆయన ఎన్నికలు జరిగి, హంగ్ ఏర్పడి, బీజేపీ, కాంగ్రెస్ రెండూ తన వద్దకు మద్దతు కోరి వస్తే వారి ముందు ప్రత్యేక హోదా ఇస్తామనే పత్రాలు పెట్టి సంతకాలు చేయమంటారట. వాటిపై ఎవరు సంతకం చేస్తే వారికి తన పాతికమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని జగన్ ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం మీద అన్న పిలుస్తున్నాడు కార్యక్రమంలో జగన్ చేసిన ప్రసంగం కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో పాటు దేశ రాజకీయాల్లో కూడా ఆసక్తికరంగా మారాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: