విత్తనం వేసిన రైతుకు మొలకెత్తి పండుతుందని తెలుస్తుంది. పెట్టుబడి పెట్టిన వ్యాపారికి లాభాలు ఎంత వస్తాయో ఓ అంచనా ఉంటుంది. అయితే ఏదీ కూడా నూరు శాతం నిజం అవదు, ఒక లెక్కగా మాత్రమే తీసుకోవాలి తప్ప పక్కాగా ఇదే జరిగితీరుతుందని  చెప్పలేని స్థితి.


ఓట్ల పంట పండుతుందా.:


రాజకీయాల్లో తీసుకుంటే చేసే ప్రతి పని కూడా ఓట్ల పంట పండించుకోవాలనే నాయకుడు చూస్తాడు. ఇక అధినాయకుడు ఏదైనా పాలసీ తీసుకున్నపుడు అది ఎన్ని ఓట్లు తెస్తుందన్న దాని మీదనే ఆలోచన చేస్తాడు. ఏపీలో చూసుకుంటే చంద్రబాబు చేతికి ఎముక లేదన్నట్లుగా ఇపుడు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఆయన్ని కర్ణుడు పూనాడా లేక శిబి చక్రవర్తి ఆవహించాడా అన్నట్లుగా కాదనకుండా లేదనకుండా అన్నీ చేసేస్తున్నారు. అయితే ఈ దానాలకు ఓట్లు రాలుతాయా అన్నదే ఇపుడు ప్రశ్న.


అయిదేళ్ళు మాడ్చి...:


దీనికి రాజకీయ విశ్లేషణలు వేరేగా వస్తున్నాయి. అయిదేళ్ళు పస్తులతో మార్చి ఇపుడు పరమాన్నం ఇస్తే కోపం చలారుతుందా అన్నదే తలపండిన పండితుల ప్రశ్న. ఏపీలో చూసుకుంటే చంద్రబాబు జమానాలో శాశ్వతమైన అభివ్రుధ్ధి ఏదీ నోచుకోలేదు. పోనీ సంక్షేమం  అయినా సవ్యంగా జరిగిందా అంటే అదీ లేదు. కానీ ఎన్నికలు వస్తున్నాయని తెలియగానే ఎక్కడలేని ప్రేమ కురిపిస్తోంది ప్రభుత్వం. పించనుదారులకు వేయి కష్టాలు పెట్టి వేయి రూపాయలు నిన్నటి  వరకూ ఇచ్చేవారు. ఇక గ్రామాల్లో అయితే వ్రుద్ధులని కూడా  చూడకుండా అందులోనూ కమిషం కొట్టేసే కమిటీలు దాపురించాయి. 


విసుక్కుని, కసురుకుని పించనుదారులకు ఫ్రీగా తామే ఇస్తున్నట్లు ఫోజు కొట్టిన వారు ఇపుడు ఒక్కసారిగా  మారిపోయారు. అన్నం పెట్టి మరీ రెట్టించిన పించన్లు ఇస్తున్నారు. బాగానే ఉంది కానీ ఈ ముచ్చట ఎన్నాళ్ళు అన్న డౌట్లు ఎంత వ్రుద్ధులకైనా రాకుండా ఉంటాయా. పైగా ఈ హామీలు కూడా వైసీపీ ఇచ్చినవే. రేపు టీడీపీ  అధికారంలోకి వచ్చాక కాదని చెబితే గతేంటి. ద్వాక్రా మహిళలకు పోయిన ఎన్నికల్లో రుణ మాఫీ చేస్తామని చెప్పి ఉత్త చేయి చూపించారు. రైతల రుణ మాఫీకి అతీ గతీ లేదు. ఇపుడు కొత్తగా ఇస్తున్న  వాటిని చూసి మెచ్చి మేకతోలు కప్పుతారా. అందువల్ల  ఇది అంత వర్కౌట్ అవుతుందా అన్నదే  అయ్యవార్లకు కలుగుతున్న సందేహమే.


ప్రమాణం నిలిచేనా :



రాజ్యాంగం మీద చేయించుకున ప్రమాణాలకే దిక్కు లేదాయే. ఇపుడు గ్రామాల్లో లబ్దిదారులను ఒట్లు వేయించుకుని ఓట్లు అడిగే పరిస్థితికి అధికార పార్టీ నేతలు వచ్చేశారు.  కానీ వారు కూడా మనకంటే తెలివైన వారే కదా. ఇలా ఒట్టు వేసి అలా గట్టు మీద పెడితే నేతాశ్రీల సంగతేంటో. అసలు ఈ ఒట్లు ప్రమాణాలు ఏంటని వైసీపీ నేతలు కూడా మరో వైపు గట్టిగానే గద్దిస్తున్నారు. ఎన్నికలపుడు రేషన్ కార్డులు, అధార్ కార్డులు తమ వద్ద ఉంచేసుకుని ఓట్లు వేయించుకున్నాక  ఇవ్వడం ఇంతవరకూ జరిగిన కధ.


ఇపుడు పించన్ల విషయంలో ఒట్టు పెట్టు, పించన్ పట్టు స్కీం నడుస్తోంది. ఎన్ని చేసినా కూడా ఈవీఎం ల వద్దకు వెళ్లి ఎవరూ చూడలేరు కదా. మరీ ఇన్ని ఆంక్షలు,  వత్తిళ్ళు  పెట్టి మాకే ఓటు అంటూ గద్దిస్తే నిజంగానే అది నెగిటివ్ అవుతుంది కదా. అపుడు సీన్ రివర్స్ ఖేల్ ఖతం అవదన్న గ్యారంటీ ఏంటి.  లేటేస్ట్ గా మంత్రి అచ్చెమ్నాయుడు మన  పించను తీసుకుని మన పధకలు తీసుకుని ఓట్లు వేయకపోతే ఎలాగో మీరే చూసుకోండంటూ క్యాడర్ కి దిశానిర్దేశం చేశారట. మరి ఇంతలా మంత్రి వర్యులే ఓటు వేయకపోయావో అంటూ చెబుతూంటే  ఓటర్ల మనసులో ప్రేమ పొర్లుతుందా, తెలియని భయంతో కూడిన వ్యతిరేకత వస్తుందా. కాబట్టి అభిమానం అన్నది ఊరకే పుట్టదు, దాన్ని ఎలా తెచ్చుకోవాలో అయిదేళ్ళ పాలనలో  ఏలికలు తెలుసుకోవాలి తప్ప ఇలా  అప్పటికపుడు వరాలు. తాయిలాలు, బెదిరింపులతొ, ఒట్టుతో  ఓట్లు రాలవేమో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: