ఎపుడైనా మన బలం ముందు చూసుకోవాలి. అంటే ఆత్మ విమర్శ అన్న మాట. మనకు ఎక్కడ పట్టుంది. ఎక్కడ వీక్ ఉంది అన్నది తెలుసుకుంటే విజయం మనదే. ఈ అవగాహన అన్ని రంగాల్లో ఉన్న వారికీ అవసరమే మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వారికి ఇంకా అవసరం.


ఉత్తరాంధ్ర వైపు :


విషయానికి వస్తే జనసేనాని పవన్ కళ్యాణ్ చూపు ఇపుడు  ఉత్తరాంధ్ర మీద పడింది. ఆయన తనకు వచ్చే ఎన్నికల్లో ఘన విజయానికి నిచ్చెన మెట్లు ఈ మూడు జిల్లాలు అని బాగా నమ్మకం పెట్టుకున్నారట. గత ఏడాది జూన్, జూలై నెలల్లో పవన్ ఈ జిల్లాలో పర్యటించినపుడు జనం బ్రహ్మరధం పట్టారు. దాంతో రెట్టించిన ధీమాతో పవన్ ఇక్కడ పాగా వేసేయాలనుకుంటున్నారు. ఇక్కడ బీసీలు, కాపులు, మెగా ఫ్యాన్స్ చాలా ఎక్కువ. గతంలో ప్రజారాజ్యం టైంలో ఆ పార్టీకి ఇక్కడ నాలుగు అసెంబ్లీ సీట్లు వచ్చాయి. అంటే కొద్ది నెలల తేడాలోనే పార్టీకి అంత ఆదరణ ఉంటే తాను అయిదేళ్ళుగా జనం మధ్యన ఉన్నాను కాబట్టి తనకు ఎక్కువ మొత్తంలో సీట్లు వచ్చిపడతాయని పవన్ భావిస్తున్నారుట. దానికి తోడు ఈసారి కామ్రెడ్స్ కూడా తనతో పొత్తులో ఉంటారు కాబట్టి వారి సాయంతో మెజారిటీ సీట్లు పట్టుకెళ్ళోచ్చు అన్న ధీమాలో ఉన్నారని టాక్.


పాతిక వరకూ సీట్లు :


జనసేన పార్టీ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గాను పాతిక వరకూ సీట్లలో పోటీ చేయాలని గట్టి నిర్ణయం తీసుకుంది. మిగిలిన సీట్లు పొత్తులో భాగంగా వామపక్షాలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో సీట్లు వారికి ఇవ్వాలని భావిస్తున్నారుట. మూడు జిల్లాల్లో  మూడింటి వంతునమొత్తం తొమ్మిది  సీట్లు  కామ్రేడ్స్ కి ఇచ్చి వారి మద్దతుతో తాను పోటీకి దిగితే ఎక్కువ సీట్లు పార్టీ పరం అవుతాయని పవన్ నమ్మకంగా ఉన్నారని టాక్. ఈ నెల నాలుగవ వారంలో విశాఖ రానున్న పవన్ అపుడే క్యాండిడేట్లను ప్రకటిస్తారని పార్టీ వర్గాల సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: