2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి చంద్రబాబు అధికారంలోకి రావటానికి కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు.

Image result for pawan kalyan janasena

ముఖ్యంగా గత ఎన్నికలలో చంద్రబాబు అధికారంలోకి రావడానికి గల కారణాలలో ఒకటి ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీ హవా...ముఖ్యంగా ఈ రెండు జిల్లాలలో పవన్ కళ్యాణ్ పిలుపుతో ప్రభావితమైన చాలామంది ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు. కేవలం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే వైసీపీ పార్టీ కి ఒక స్థానం లభించింది.

Image result for pawan kalyan janasena

అయితే ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో టిడిపిని వీడిన పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికలలో 175 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేసిన విషయం మనకందరికీ తెలిసినదే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో  తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుండి పోటీ చేయడానికి నిశ్చయించుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

Image result for pawan kalyan janasena

అంతేకాకుండా 175 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల కసరత్తును కూడా పవన్ ద్రుష్టి సారించారని సమాచారం. అయితే పిఠాపురం న్నుండి పోటీ చేయడానికి జనసేన నాయకులూ ఎవరు కూడా ముందుకు రావడం లేదంట. అందుకు కారణం పవన్ పిఠాపురం లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్ వినబడుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: