ఎన్నికల ముందు చంద్ర బాబు హడావిడి చూస్తే ఆశ్చర్యం రాక మానదు. నాలుగేళ్లు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఎన్నికల రెండు నెలల ముందు బాబు చేస్తున్న విన్యాసాలు ప్రజలు గమనిస్తున్నారు. ఆ హామీలను తూతూ మంత్రంగా అమలు చేస్తున్నాడు చంద్రబాబు.మరి వీటి ఫలితంగా బాబు గ్రాఫ్ లేస్తోందా? అంటే.. గట్టిగా ఔను అనలేని పరిస్థితి. ఒకవేళ ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఈ హామీలను అమలు చేస్తున్నాడు కాబట్టి ఎంతోకొంత సానుకూలత ఉండేదేమో. అయితే అవి జగన్ హామీలుగా జనాల్లోకి వెళ్లిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇలా వ్యవహరిస్తూ ఉండటంతో.. జగన్ చెప్పనవి చంద్రబాబు చేస్తున్నాడు అనే చర్చ కూడా జనాల్లోకి వెళ్తోంది.

Image result for chandrababu naidu

ఒకవైపు చంద్రబాబు నాయుడు తన గురించి తాను చెప్పుకొమ్మంటే.. ఎంతైనా చెప్పుకుంటాడు. అలా చెప్పుకోవడంలో తను అనుభవజ్ఞుడిని అని బాబు డప్పుకొట్టుకొంటూ ఉంటాడు. అది కూడా నలభైయేళ్ల అనుభవం. అంత అనుభవం ఉండి.. ఇలా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు నలభైయేళ్ల జగన్ హామీలను కాపీకొట్టాల్సి వస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడానికి ఏం చేయాలో తెలియక చంద్రబాబు ఆఖరికి ఇలా వ్యవహరిస్తున్నాడు.

Image result for jagan

మరి ఇంకెక్కడి అనుభవం? జగన్ కు పంచాయితీ ప్రెసిడెంట్ అనుభవం లేదంటూ.. రెచ్చగొట్టే మాటలు మాట్లాడే చంద్రబాబు నాయుడు... తీరా జగన్ హామీ పత్రాలను కాపీకొడుతున్నాడు. మరి ప్రజలను ఆకట్టుకోవడానికే సొంతంగా ఏమీచేయలేక జగన్ ను కాపీకొడుతున్న బాబు.. పాలనను మాత్రం ఏం చేస్తూ ఉంటాడు? పాలన విషయంలో బాబు డొల్లతనం ఏమిటో అదీ బయటపడుతూనే ఉంది. ప్రత్యేకహోదా విషయంలో బాబు మాట మార్చిన తీరే అందుకు రుజువు.


మరింత సమాచారం తెలుసుకోండి: