ఎన్నికల ముందు చంద్ర బాబు ... పవన్ కళ్యాణ్ ను ఇంకా దువ్వే పనిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే టీడీపీ తో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాడు. అయినా చంద్ర బాబు కు మాత్రం ఇంకా ఆశలు  పోలేదు. అయితే చంద్రబాబునాయుడు తనను నెత్తిన పెట్టుకుంటున్నప్పటికీ కూడా.. పవన్ కల్యాణ్ మాత్రం.. ఎడాపెడా.. తెలుగుదేశాన్ని చీల్చి చెండాడేస్తూనే ఉన్నారు. తెదేపా నాయకులు ఎవరైనా పవన్ తో పొత్తుల గురించి కాస్త సానుకూలంగా మాట్లాడితే చాలు.. వారిమీద ఒంటికాలిపై విరుచుకుపడిపోతున్నారు.

Image result for chandra babu and pavan

పవన్ కల్యాణ్ తన వారిని, తన పార్టీని ఎంత చీదరించుకుంటున్నా.. తన అవినీతిని ఎంతగా తూలనాడుతున్నా.. అసహ్యించుకుంటున్నా సరే.. చంద్రబాబు మాత్రం బ్యాలెన్స్ తప్పడంలేదు. ఇప్పటికీ పవన్ కల్యాణ్ ను మచ్చిక చేసుకునే రీతిలోనే మాటలు సంధిస్తున్నారు. కేంద్రం మన రాష్ట్రానికి 80 వేలకోట్లు ఇవ్వాల్సి ఉన్నదని పవన్ కల్యాణ్ లెక్క తేల్చారంటూ.. ఆ లెక్కలను చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. చూడబోతే రాష్ట్రానికి ఎంత సొమ్ములు రావాలనే విషయంలో చంద్రబాబు వేసుకునే లెక్కలకంటె.. పవన్ కల్యాణ్ వేసిన లెక్కలే జాస్తిగా ఆయనకు కనిపిస్తున్నట్లుగా ఉంది.

Image result for chandra babu and pavan

ఆరకంగా పవన్ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి చూపిస్తున్నాడని, జగన్మోహన రెడ్డి చూపించడం లేదని అంటగట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కుదిరిన లోపాయికారీ ఒప్పందాల మేరకు.. పవన్ ను తుది సమయంలో తెరచాటు అవగాహన మేరకు.. జగన్ కు మెజారిటీ దక్కగల స్థానాల్లో బలంగా ప్రయోగించే ఆలోచన చంద్రబాబుకు ఉండవచ్చు గాక.. అందుకే ఆయనను విమర్శించడం మానేసి.. సాఫ్ట్ గా మాటలు వల్లిస్తుండవచ్చు గాక.. కానీ.. ఇలాంటి మహావక్ర మాయోపాయాల్లో తేడావస్తే మొదటికే మోసం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: