ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం కలుగుతోంది. ఎపీలో అసలే ఉనికిపాట్లు పడుతున్న ఆ పార్టీకి కొత్త కష్టాలు దాపురించాయి. నిన్నటికి నిన్న రాయసీమ పెద్దాయన  కోట్ల సూర్యప్రకాశ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెపుతున్నట్లుగా న్యూస్ వచ్చింది. ఇపుడు మరో సీనియర్ నేత సుదీర్ఘ కాలం కాంగ్రెస్ తో అనుబంధం కలిగిన నాయకుడు హస్తం పార్టీని వీడిపోవడం భారీ దెబ్బే మరి.


ఎపీలో పెద్ద నాయకునిగా :


ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెద్ద నాయకునిగా వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఉన్నారు. ఆయన మొదట్లో  కాంగ్రేసేతర రాజకీయాల్లో బాగా పాలు పంచుకునేవారు. అయితే చివరికి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నత స్థానంలో ఉంటూ వచ్చారు. ఇందిరా గాంధీ నుంచి ఆ కుటుంబానికి సన్నిహితుడైన వైరిచర్ల ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పడం శరాఘాతమే. కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన ఆయన పార్టీ కోసం ఎంతో క్రుషి చేశారు. ఏపీ  విభజన వద్దు అని చెప్పిన వారిలో ఆయన కూడా ఒకరు. చేసేది లేక కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన 2014 ఎన్నికల్లో అరకు పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.
ఈ అయిదేళ్ళలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందేమో మార్పు వస్తుందేమో అని ఎదురుచూసిన ఆయనకు ఆ పార్టీ పోకడలు నిరాశనే కలిగించాయని అంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, మళ్ళీ ఏపీలో వద్దనుకోవడం రెండూ ఆ పార్టీ ఇష్టారాజ్యంగా చేసింది. దీంతో సీనియర్ నాయకులు మరింతగా గందరగోళంలో పడ్డారు. దాని ఫలితమే కోట్ల, వైరిచర్ల లాంటి సీనియర్ మోస్ట్ నేతలు పార్టీని వీడేందుకు రెడీ కావడం అని అంటున్నారు.


వైసీపీ వైపేనా  :


వచ్చే ఎన్నికల్లో అరకు ఎంపీగా మరో మారు పోటీకి రెడీ అవుతున్న వైరిచర్ల దివంగత నేత  వైఎస్సార్ తో కూడా మంచి అనుబంధం కలిగిన నేత. ఆయన  తాను ఏ పార్టీలో చేరేది తొందరొలో చెబుతానని ప్రకటించారు. అయితే ఆయన వైసీపీ నుంచి అరకు ఎంపీగా పోటీకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వైసీపీకి కూడా అరకు ఎంపీకి సంబంధించి గట్టి అభ్యర్ధులు లేరు. దాంతో ఆయన్ని పార్టీలోకి తీసుకోవాలని చూస్తున్నారు. అన్నీ కుదిరితే వైరిచర్ల వైసీపీ తీర్ధూం పుచ్చుకోవం ఖాయంగా కనిపిస్తోంది. మరి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: