ఉండవల్లి అరుణ్ కుమార్ అంటేనే సంచలనాల పుట్ట. ఆయన నోరు విప్పితే చాలు బాణాలు ఎవరి మీద సంధిస్తారో అని అందరూ టెన్షన్ పడుతూంటారు. తెలివైన రాజకీయ నాయకుడు, పైగా న్యాయ వాది. ఉండవల్లిని ఎదుర్కోవడం అంటే చాలా కష్తం. లాజిక్ తో ఆయన వేసే ప్రశ్నలకు ఎదుటి వారు జవాబులు అసలు ఇవ్వలేరు. మౌనంగా ఉండడం తప్ప.


జగన్ పార్టీలోకి పిలిచారు :


వైఎస్ జగన్ తనని పార్టీలోకి ఎపుడో పిలిచారంటూ ఉండవల్లి సంచలన కామెంట్స్ చేశారు. ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ తో తన రిలేషన్లు చాలా బాగున్నాయని కూడా చెప్పుకొచ్చారు. జగన్ చిన్నప్పటి నుంచి తనకు తెలుసు అని, వైఎస్సార్ కొడుకుగా జగన్ని తాను ఎపుడు అభిమానిస్తానని ఉండవల్లి అనడం విశేషం. జగన్ ముఖ్యమంత్రి అయితే సంతోషించే వారిలో తాను మొదట వరసలో ఉంటానని కూడా అయన చెప్పుకొచ్చారు.  తన పార్టీలోకి ఎపుడైనా రావచ్చు అంటూ జగన్ తనకు గ్రీన్ కార్డ్ ఇచ్చారని ఉండవల్లి చెప్పడం ఇక్కడ విశేషం. రాజకీయాల నుంచి తప్పుకున్న తాను ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించానని ఉండవల్లి పేర్కొన్నారు.


సర్వేల్లో వచ్చినవి జరగవ్ :


సర్వేల్లో వచ్చినవి ఫలితాల్లో జరగవని ఉండవల్లి అన్నారు జగన్ పార్టీకి ఈ రోజు గాలి ఉన్నా రేపు ఏం జరుగుతుందో చెప్పలేమని అన్నారు ఇప్పటికైతే ఏపీలో వైసీపీదే అధికారమని ఆయన అన్నారు. అయితే బాబుని మాత్రం తక్కువ అంచనా వేయలేమని, భారతదేశంలో ఎన్నికలు ఎమోషన్ల మీద ఆధారపడి జరుగుతాయని ఆయన అన్నారు. ఏపీలో రేపటి రోజున ఏం జరుగుతుందన్నది ముందే చెప్పలేమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా జగన్ కి అవకాశాలు బాగానే ఉన్నాయని ఆయన అనడం విశేషమే.


బీజేపీ పెద్ద పార్టీ :


ఇక దేశంలో చూసుకుంటే బీజేపీ పెద్ద పార్టీగా వస్తుందని మిగిలిన పార్టీలను కూడగట్టుకుని ఆ పార్టీ మళ్ళీ పవర్లోకి వస్తుందా లేదా అన్నది ఇపుడే చెప్పలేమని ఉండవల్లి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న రాహుల్ ప్రధాని అవడానికి కాంగ్రెస్ కు సింగిల్ గా 200 పై దాటి ఎంపీ సీట్లు రావాలని, ఆ పరిస్థితి ఉందా అన్నదే ప్రశ్న అన్నారు. ఇక కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు, కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ తో జగన్ దోస్తీ వంటి వాటి వల్ల ఏపీ రాజకీయాల్లో మార్పులేవీ ఉండవని ఆయన అన్నారు. జగన్, కేసీయార్ దోస్తీ వల్ల జగన్ కి నష్టమూ ఉండదు, లాభమూ ఉండదని తేల్చేశారు. పవన్ కళ్యాణ్  తో తనది భావోద్వేగ భరితమైన బంధమని ఉండవల్లి చెప్పడం కొసమెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: