తెలుగుదేశం పార్టీ అంటే ఏకశిలా సద్రుశం. ఏ పార్టీలోనైనా విభేదాలు ఉంటే బయటపడతాయేమో కానీ టీడీపీలో అలాంటిది ఉండదు. పైగా అధినాయకుడు ఏం చెప్పారో అదే బూత్ కమిటీ మెంబర్ కూడా వల్లే వేస్తాడు. అంత పక్కా ట్రైనింగ్ టీడీపీలో ఉంటుంది. అందుకే ఆ పార్టీలో నుంచి ఎవరిని కదిపినా ఒక విషయం మీద ఒకే అభిప్రాయం వస్తుంది. అటువంటి నిర్మాణం పార్టీకి అందించిన ఘనత చంద్రబాబుదే.


ఎన్నికల వేళలో :


అయితే ఎంత కట్టుబాట్లు ఉన్నా టీడీపీలో ఎన్నికల వేళ కొన్ని రాగాలు శ్రుతి మించుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తన బుర్రకు పదును పెట్టి మరీ కొత్త పధకాలను చంద్రబాబు ప్రవేశపెడితే తమ్ముళ్ళు కొందరు తమ అతి తో వాటిని కంపు కొట్టిస్తున్నారు. దాంతో రావాల్సిన పేరు కంటే జరగాల్సిన  నష్టం ఎక్కువగా ఉంటోంది. పించన్లను  ముసలివాళ్ళకు  అందిస్తూ అదొక పండుగలా చేయాలని బాబు ఆదేశాలు జారీ చేశారు. ఆ విధంగా చేస్తే ఓట్ల పంట పండుతుందని, వారి మనసుల్లో పార్టీ ఉంటుందని ఉద్దేశ్యం. కానీ జరుగుతున్నదేంటి.


ఆ ఎమ్మెల్యే అలా  :


పెన్షన్‌ కోసం వచ్చిన వృద్ధుడిపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ దాడి చేయడం బాధాకరమని వైఎస్సార్‌సీపీ నేత సుధాకర్‌ బాబు అన్నారు. చింతమనేని ఒక వీధి రౌడీలా  వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వివాదాలకు మారు పేరుగా ఉన్నటీడీపీ  చింతమనేని ప్రభాకర్ ఓ వ్రుధ్ధున్ని కొట్టారన్న వార్త ఇపుడు ఆ పార్టీకి ఎక్కడలేని చెడ్డపేరుని తెచ్చిపెడుతోంది. సామాజిక పించన్లు రెండింతలు చేశారన్న మైలేజి ని పార్టీకి లేకుండా చేస్తోంది. దీని మీద వైసీపీ నాయకులు అపుడే విమర్శలు కూడా మొదలెట్టేశారు. జనంలోకి ఈ విషయాన్ని తీసుకుపోయారు. ఇక పించన్లను పండుగలా బాబు చేయమంటే తమ్ముళ్లు అతికి పోయి చాలా చేస్తున్నారు. తాము వస్తే తప్ప పించన్లు ఇవ్వొద్దు అంటూ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఆదేశాలు ఇస్తున్నారు. అంతవరకూ ఎండల్లో పండుటాకులు ఆలా ఉండిపోతున్నారు.


ఇక జన్మభూమి కమిటీ తమ్ముళ్ళ తీరు మరోలా ఉంది. పించన్లలో తమ వాటా అంటూ కమిషన్లు కొట్టేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల నోటి దురుసుతనంలో నేతలు లబ్దిదారులను తమ పార్టీకో ఓటు వేయాలంటూ గదమాయించడమూ జరుగుతోంది. ఇక ఒట్లు వేయించుకుంటున్న ఘటనలూ చాలా ఉన్నాయి. ఇక మరో మంత్రి అచ్చెం నాయుడు మా డబ్బులు పించన్లు దొబ్బి మాకెందుకు ఓట్లు వేయరూ అని అడగాలని ఏకంగా క్యాడర్ కే పురమాయించారు. ఇలా చెప్పాక తమ్ముళ్ళు ఊరుకుంటారా. ప్రతీ చోటా జై చంద్రబాబు అనిపించేంతవరకూ పించను దారులను వదలడంలేదు


దాంతో మొదట్లో కనిపించిన అనుకూలత మెల్లగా వ్యతిరేకతగా మారుతోంది. దీనికి తమ్ముళ్ల అతి చాలా కారణం. ఇదే తీరులో మరింతగా జోరు పెంచింతే ఈ పధకాల పుణ్యం కాస్తా పాపంగా శాపంగా మారినా ఆశ్చర్యపోనవసరంలేదని అంటున్నారు. అభిమానం అనేది  బలవంతంగా రాదు, ఇప్పటికైతే బాబు పధకాల పట్ల కొంత అనుకూలత ఉంది. దాన్ని కంపు చేస్తున్న తమ్ముళ్ళు తమ చర్యలు తగ్గించుకోకపోతే చివరకు అది బూమరాంగ్ అవుతుంది. మరి దీన్ని అధినాయకత్వం ఎలా సరిచేస్తుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: