అదేంటో మన చెట్టుకు పండ్లు కాసినవి తింటే తీపి ఉండదు. ఎత్తుకొచ్చిన జామపండు మాత్రం భలే తీపిగా ఉంటుంది. ఇది మానవ సహజసిధ్ధమైన సైకాలజీ. రాజకీయాల్లోనూ ఇంతేనేమో. మన పార్టీ వారిపైన కంటే పొరుగు పార్టీ వాడు బాగా పొడుగ్గా కనిపిస్తాడు. అందుకే వల వేసి మరీ బుట్టలోకి తీసుకువచ్చేంతవరకూ అధినాయకులకు నిద్ర పట్టదు.


మళ్ళీ ఫిరాయింపులు :


విశాఖ జిల్లాలో మరో మారు కండువాలు మార్చుకునే కార్యక్రమం పెద్ద ఎత్తున జరగనుంది. శూన్యమాసం పోయి మంచి రోజులు రావడంతో టీడీపీ ఆ పని మొదలెట్టేస్తోంది. విశాఖ జిల్లాకు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారుట. దాంతో మిగిలిపోయిన నాయకులను సైకిలెక్కిచేస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.  విశాఖ జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామక్రిష్ణ ఉన్నారు. అలాగే మాజీ ఎంపీ సబ్బం హరి కూడా ఉన్నారు. ఈ ముగ్గురూ సీఎం సమ‌క్షంలో  టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం సాగుతోంది 


ఆయన కూడానా :


ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వ్రుధ్ధ నేత, మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ కి టీడీపీ తీర్ధం ఇప్పించాలని ఆ పార్టీ  ఉవ్విళ్ళూరుతోంది. గతంలో టీడీపీని తీవ్రంగావ్యతిరేకించిన ఈ రాజా వారు ఇపుడు మనసు మార్చుకున్నారని అంటున్నారు. అదే జరిగితే ఆయన్ని అరకు నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారని అంటున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి క్రుపారాణిని కూడా టీడీపీ వైపు తీసుకురావాలని అనుకుంటున్నారు.


ఆమె వైసీపీలో చేరుతారని అనుకున్నా అక్కడ సీటు పై పేచీ రావడంతో సైలెంట్ గా ఉన్నారు. ఎన్నికల వేళ ఆమెను కూడా పార్టీఒలఒకి తీసుకువస్తే మంచిదని పసుపు పార్టీ చూస్తోంది. అలాగే విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ నేత సాంబశివరావుని కూడా టీడీపీలోకి తెస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.   మొత్తానికి ఉత్తరాంధ్రా జిల్లాలో బలమైన పార్టీగా ఉంటూ సత్తా చాటుతున్న టీడీపీకి ఇంకా నాయకులు కావాల్సి రావడం విడ్డూరమే. 



మరింత సమాచారం తెలుసుకోండి: