చంద్రబాబునాయుడులో పెరిగిపోతున్నట్లే మంత్రులు, ఎంఎల్ఏలు, నేతల్లో కూడా అసహనం తీవ్రస్ధాయికి చేరుకుంటోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు టిడిపిలో పెరిగిపోతున్న అసహనం దేనికి సంకేతాలంటూ పెద్ద చర్చే మొదలైంది. ఒకవైపు చంద్రబాబు స్వయంగా ఓటర్లను బెదిరిస్తున్నారు. దాంతో మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా బెదిరింపులకు దిగుతున్నారు. మొన్ననే శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు బహిరంగాం చేసిన వ్యాఖ్యలు అందిరికీ తెలిసిందే. ప్రభుత్వం నుండి పింఛన్లు, సంక్షేమ పథకాలు దొబ్బుతు టిడిపికి ఓట్లేయనంటే ఎలాగంటూ అచ్చెన్న ఓటర్లను బెదిరించటం సంచలనమైంది.

 

తాజాగా దెందులూరు ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ కూడా బెదిరింపులకు దిగారు. మామూలుగానే చింతమనేని అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. నియోజకవర్గంలో తనకు ఎదురుతిరిగిన ప్రతీ ఒక్కరినీ తిట్టటం, కొట్టటంతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి చింతమనేని తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఓ వృద్ధుడిని పట్టుకుని బండబూతులు తిట్టారు. కార్యక్రమంలోనే వృద్ధుడని పట్టుకుని ‘ఏరా నీ కొడుకులు వైఎస్సార్పీపిలో తిరుగుతుంటే ప్రభుత్వం ఇచ్చే పింఛన్ తీసుకోవటానికి సిగ్గు లేదా’ అంటూ అందరిముందు అమ్మనాబూతులు తిట్టారు.

 

టిడిపి నేతల వరస చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని డిసైడ్ అయినట్లే కనిపిస్తోంది. ఆ ఉక్రోషంతోనే ఎదుటి వారిపై తమ నోటికొచ్చినట్లు ఎగిరెగిరి పడుతున్నారు. ఓటర్లను బ్రతిమలాడుకుంటే ఓట్లేస్తారేమో కానీ బహిరంగంగా నోటికొచ్చినట్లు తిడితే ఎలా ఓట్లేస్తారన్న కనీసం ఇంగితం కూడా వారిలో లోపిస్తోంది. అప్పటికేదో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల డబ్బు పార్టీ నుండో, తమ సొంత జేబుల్లో నుండో లేకపోతే హెరిటేజ్ డబ్బుల్లో ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. మొత్తం మీద సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా తమకు జనాలు ఓట్లేయరు అనే నిర్ణయానికి చంద్రబాబు అండ్ కో వచ్చేసినట్లే అందరికీ అర్ధమవుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటర్లు చుక్కలు చూపటం ఖాయమేనా ?


మరింత సమాచారం తెలుసుకోండి: