ఎన్నికలు దగ్గర పడుతుండటం తో అధికార పార్టీ , అటు ప్రతి పక్ష పార్టీ ప్రజల కోసం వరాల జల్లు కురిపిస్తున్నారు. అయితే చంద్ర బాబు పెన్షన్ ను రెండు వేలకు పెంచి నాడు కూడా . దీనితో జగన్ మూడు వేలు ఇస్తానని ప్రకటించాడు. పెన్షన్ మొత్తాలను రెండు వేల రూపాయలకు పెంచుతామని అప్పట్లో హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి... ఒకవేళ చంద్రబాబు నాయుడు పెన్షన్ మొత్తాన్ని రెండువేల రూపాయలకు పెంచితే, తాము అధికారంలోకి వచ్చాకా దాన్ని మూడువేల రూపాయల మొత్తానికి పెంచుతామని అప్పట్లోనే హామీ ఇచ్చారు. జగన్ అనుకున్నట్టే అయ్యింది.

Image result for jagan

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నరవత్నాలు పథకాలను అప్పట్లో తప్పుపట్టిన చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత వాటిని ఒక్కొక్కటిగా కాపీకొట్టడం ప్రారంభించారు. అందులో భాగంగా జగన్ చెప్పినట్టుగానే.. పెన్షన్ మొత్తాన్ని రెండు వేల రూపాయలకు పెంచారు. ఎన్నికలు మరో రెండునెలలు ఉన్న నేపథ్యంలో పెన్షన్ మొత్తాలను పెంచి పాలాభిషేకం చేయించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు.

Image result for jagan

ఇలాంటి నేపథ్యంలో జగన్ ఇంతకు ముందు తను చెప్పిన విషయాన్నే మళ్లీ చెప్పారు. పెన్షన్ మొత్తం మూడు వేల రూపాయలకు పెంచుతామని ప్రకటించారు. ప్రతి అవ్వా తాతకూ పెన్షన్ మొత్తాన్ని మూడు వేల రూపాయలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఒకవైపు రెండు వేల రూపాయలు పెన్షన్ అని.. తెలుగుదేశం పార్టీ వాళ్లు గట్టిగా ప్రచారం చేసుకొంటూ ఉన్నారు. జగన్ మూడు వేల రూపాయలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: