చంద్ర బాబు కొన్ని సార్లు చేస్తున్న కామెంట్స్ మరీ విచిత్రంగా ఉంటాయి. తనకు అనుకూలంగా ప్రతి విషయాన్ని తిప్పుకోవడానికి ఎలాగైనా మాట్లాడ గలుగుతాడు. అక్కడ సబ్జెక్ట్ ఏమిటి, కాన్సెప్ట్ ఏమిటీ.. అనేవి చంద్రబాబుకు అవసరం లేదు. ముందుగా మోడీని తిట్టాలి, ఆపై జగన్ ను అలాగే కేసీఆర్ ను అందులో ఇరికించాలి. ఇప్పడూ లేటెస్ట్ గా మమతా వ్యవహారం లో అదే చేసినారు. బెంగాల్ వ్యవహారంలో దేశమంతా కేంద్రాన్ని తప్పుపట్టింది.. అందరూ స్పందించారు.  అని బాబు సెలవిచ్చారు.

Image result for chandrababu naidu

దేశమంతా ఎక్కడ స్పందించింది స్వామీ.. మీరొక్కరే ప్రత్యేక విమానం వేసుకుని వెళ్లావు.. దేశంలోని ఏ రాజకీయ నేత అటువైపు కూడా చూడలేదు.. అనే సందేహం కూడా ఎవరికీ రాకూడదు. చంద్రబాబు స్పందించారు  కాబట్టి.. దేశమంతా స్పందించినట్టే! బెంగాల్ వ్యవహారం గురించి తను స్పందించాను కాబట్టి.. అంతా తను చెప్పినట్టుగా తందానా అనాలి. లేకపోతే వాళ్లంతా మోడీకి బానిసలు! ఇదీ చంద్ర సిద్ధాంతం. దీనికి ఒక హద్దంటూ లేదు, నియమం అంటూ లేదు. ఎలా పడితే అలా సాగుతూ ఉంటుంది.

Image result for chandrababu naidu

చంద్రబాబుకు ఎలా నాలుక మడత పడితే అలా మాట్లాడతారు. అంతా అలాగే మాట్లాడాలని ఇలా హూంకరిస్తారు. ఇంతజేసీ నాలుగున్నర  సంవత్సరం పాటు మోడీ భజన చేసింది బాబుగారే. మోడీ మించిన తోపు లేడని మోడీ మళ్లీ ప్రధాని కావాలని తీర్మానం ప్రవేశ పెట్టింది చంద్రబాబుగారే! ఇక్కడ మరో కామెడీ ఏమిటంటే.. ఇదివరకూ చంద్రబాబు నాయుడు ఇలా మోడీ మనుషులు అనే జాబితాలో జగన్, కేసీఆర్ లతో పాటు పవన్ కల్యాణ్ పేరును కూడా చేర్చేవారు. అయితే బెంగాల్ వ్యవహారం గురించి పవన్ కూడా ఏం స్పందించలేదు. అయితే ఇప్పుడు పవన్ ఊసు ఎత్తలేదు. ఇదివరకూ పవన్ ను మోడీకి దత్తపుత్రుడు అని బాబు అనేవారు. ఇప్పుడు మాత్రం కేసీఆర్, జగన్ లపై బురదజల్లేసి ఆగిపోయారు. పవన్ తో సన్నిహిత బంధం కోసం బాబు ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకనే.. ఇప్పుడు పవన్ కు మినహాయింపు!


మరింత సమాచారం తెలుసుకోండి: