ఏపీలో అనుభవం దూకుడుతనం మధ్య రంజైన పోటీ నెలకొంది అందుకే 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికలు దేశం ద్రుష్టిని బాగా ఆకట్టుకుంటున్నాయి. అప్పట్లో జగన్, చంద్రబాబు ఇద్దరూ ప్రతిపక్షంలో ఉన్నవారే. అందువల్ల ఓటరుకు అనుభవం కార్డ్ చెప్పి బాబు నెగ్గుకొచ్చారు. ఇపుదు ఆయన అధికారంలో ఉన్నారు. నెగిటివ్ ఫ్యాక్టర్ చూసుకోవాలి. మరో వైపు ప్రతిపక్షంలో దూకుడుగ జగన్ శర సంధానం చేస్తున్నారు. 


ఒక్క మీటింగుతో భారీ షాక్ :


కేవలం కొద్ది రోజున ఆనందం మాత్రమే మిగిలిందేమో. పించన్ల పండుగ అంటూ రెట్టించిన మొత్తంతో వ్రుధ్ధులు సంబరాలు చేసుకున్నారో లేదో తెలియదు కానీ పసుపు తమ్ముళ్ళు మాత్రం మళ్ళీ మాదే అధికారం అనుకుంటూ ఊహాలోకంలో తేలిపోయారు. మేము పించను ఇస్తున్నాం, మాకే ఓటేయండి అంటూ ఆర్డర్లు వేసే స్థాయిలో తమ్ముళ్ళు చెలరేగిపోయారు. ఒకానొక మంత్రి గారు అయితే మా పించన్లు పధకాలు దొబ్బి అంటూ ఏదేదో మాట్లాడేశారు.
ఇదంతా గెలిచేస్తున్నామన్న దాన్ని నుంచి వచ్చిన మాటలు. ఆ ఆనందం ఆవిరయ్యేలా తిరుపతిలో జగన్ మీటింగ్ జరిగింది. జగన్ ఒకే ఒక్క మాటతో మొత్తం హుష్ కాకీ అనిపించేసారు. రెండు వేల పించను బాబు ఇస్తే తీసుకోండి. రెండు నెలలు పోయాక ఎటూ మన ప్రభుత్వం వస్తుంది, మూడు వేల పించన్లు నేను ఇస్తానంటూ ఇచ్చిన హామీతో  ఇపుడు పసుపు శిబిరం గింగిరాలు కొడుతోందందట.


ఇది ఆరంభమేనా :



జగన్ సమర శంఖారావం ఆరంభంలోనే అదిరే షాక్ తగిలింది. ఇక మిగిలిన రోజుల్లో ఎలాంటి  ఝలక్కులు ఉంటాయో, ఏమేమి హామీలు ఇస్తారో అని తలచుకుని టీడీపీ నేతలు వణుకుతున్నారని ప్రచారమవుతోంది. పించను రెండు వేలు అంటే మరో వేయి జగన్ పెంచేసి గాలి తీసేశారు. ఇక రైతులకు ఎకరా పదివేలు అంటే 12 500 అంటున్నారు, అలాగే మిగిలిన వర్గాలకు కూడా జగన్ మార్కు హామీల గాలి తగిలితే అధికార పార్టీకి చిక్కులేనని అంటున్నారు. ఇక ఇదే నెలలో బీసీల గర్జన కూడా ఉంది. 
కులానికో కార్పోరేషన్ హామీ జగన్ దే. దాన్ని టీడీపీ కాపీ కొట్టింది. ఇపుడు  బీసీలకు జగన్ ఇంకాస్తా ముందుకు వెళ్ళి అనూహ్యమైన హామీలు ఇస్తారని టాక్. అలాగే డ్వాక్రా  అక్క చెల్లెమ్మలకు కూడా జగన్ హామీలు భారీగా ఉంటాయట. అపుడు ఆయా వర్గాలు సహజంగానే ఈ గట్టుకే వస్తారు. ఇక ఇద్దరూ ఒకే హామీ గురించి చెప్పినపుడు కొలబద్దగా విశ్వసనీయత అన్నది ముందుకు వస్తుంది. ఆ క్రెడిబిలిటీని జగన్ ఎపుడో  సొంతం చేసుకున్న వేళ లబ్దిదారులు కూడా నాచురల్ గా మొగ్గు ఇటే చూపుతారేమో. అందుకే ఇపుడు టీడీపీ శిబిరంలో యమ టెన్షన్ గా ఉందంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: