వైసీపీ ఏపీలో రేపు అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతున్న పార్టీ. గత ఎన్నికల్లో కొద్ది శాతం ఓట్ల తేడాతో ఆ పార్టీ అధికారానికి దూరంగా నిలిచింది. ఈసారి ఆ తప్పు రిపీట్ కాకూడదని జగన్ నానా తంటాలు పడుతున్నరు. అందులో భాగంగానే 3,600 కిలోమీటర్ల భారీ పాదయాత్ర కూడా చేపట్టారు.


వారితో క‌లవాలట :


మరి అటువంటి జగన్ పార్టీ ఏపీలో బలంగా ఉంటే, ఉనికి పాట్లు పడుతున్న కాంగ్రెస్ తో ఆ పార్టీ కలవాలట. ఈ ప్రతిపాదన ఎంత హాస్యాస్పదంగా ఉందో. కానీ కాంగ్రెస్ నాయకులు కదా. వారు ఏదైనా మాట్లాడుతారు, లేటెస్ట్ గా విశాఖకు చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణం రాజు శ్రీనివాస్ వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలంటూ ప్రతిపాదించారు. ఎందుచేతనంటే  రేపటి రోజున రాహుల్ గాంధి ప్రధాని అవుతారట. ఆయన ప్రత్యేక హోదా ఇస్తారట. అందువల్ల హోదా కోసం చిత్తశుద్ధి ఉంటే వైసీపీని తీసుకొచ్చేసి కలిపేయండంటూ కాంగ్రెస్ ఆయన ఉచిత  సలహా ఇస్తున్నారు.


వైసీపీ కాంగ్రెస్ లో భాగమా :


నిజానికి వైసీపీ కూడా కాంగ్రెస్ లో భాగమేనన్నది ఆయన గారి వాదన. ఆ పార్టీలో ఉన్న వారంతా కూడా కాంగ్రెస్ నాయకులేనని, అక్కడ అంతా కాంగ్రెస్ భావజాలమే ఉందని కూడా అంటున్నారు. టీడీపీ కాంగ్రెస్ తో కలవగా లేనిది జగన్ ఎందుకు కలవరని ద్రోణం రాజు  ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు, తమతో కలసి రాకపోతే మోడీ ఖాతాలోకి వైసీపీకి కలిపేస్తామని కూడా గట్టిగా చెబుతున్నారు.


దేశంలో రెండే కూటములు ఉన్నాయని ఆయన అంటూ అవి మోడీ అనుకూలం, మోడీ వ్యతిరేకమని చెప్పారు. మోడీ వ్యతిరేకి అయితే జగన్ రాహులు మద్దతు ఇవ్వాల్సిందేనని కూడా క్లారిటీగా చెప్పారు. మొత్తానికి రేపటి రోజున కాంగ్రెస్ ఏపీలో చేయబోయే ప్రచారం ఎలా ఉంటుందో ట్రైల్ గా ఇది చూపించారనుకోవాలి. మరి దీనికి వైసీపీ రిప్లై ఎలా ఉంటుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: