ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి పై దృష్టి సారించారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి తీసుకురావాలని విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటిస్తూ ప్రజలకు టిడిపి ప్రభుత్వం పై నమ్మకాన్ని కలిగిస్తున్నారు.

Related image

ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల ఏపి సిఎం చంద్రబాబు బందరు పోర్టు పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు మచిలీపట్నం ప్రజల చిరకాల కోరిక నిజమైందన్నారు. శాతవాహనుల కాలంలో ఇక్కడ నుంచి ఎగుమతి, దిగుమతులు అయ్యేవని వివరించారు. నిర్లక్ష్యానికి గురికావడంతో ప్రజలు వలస వెళ్లారని చెప్పారు.

Related image

బందరు పోర్టు నిర్మాణంతో మచిలీపట్నానికి పూర్వవైభవం తెస్తామని చంద్రబాబు వెల్లడించారు.నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేసే సత్తా నవయుగ కంపెనీకి ఉందన్నారు. పోర్టును సకాలంలో పూర్తి చేస్తామని, ప్రారంభోత్సవానికి కూడా తానే వస్తానని స్పష్టంచేశారు. బందరు పోర్టు వినియోగంలోకి వస్తే.. దేశంలోనే మచిలీపట్నం ప్రధాన ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

Image result for chandrababu

పోర్టు నిర్మాణం పూర్తయ్యేలా అందరూ సహకరించాలని కోరారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని మరొకసారి గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. అయితే మరోపక్క కొంతమంది వైసీపీ నేతలు ఎన్నికలు ఆరు నెలల ముందు మాత్రం ఇలాంటివి గుర్తుకు వస్తాయి తర్వాత యద మామూలే అని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలపై వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: