ఏపీలో మూడవ పార్టీతో మూడేదెవరికి. ఏడాది క్రితం వరకూ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్యనే రాజకీయ సమరం నడచింది. మధ్యలో జనసేన రంగంలోకి దిగడంతోనే ఈ ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనిపై ఎవరి ఆలోచనలు వారికి ఉన్నా పవన్ పార్టీతో  ప్రమాదమేనన్నది ఏకాభిప్రాయమే. మూడవ పార్టీతో ఎవరికో ఒకరికి మూడుతుందని  అంతా భావిస్తున్నారు.


సర్వే తేల్చేసింది :


ఇన్నాళ్ళూ ఏపీలో టీడీపీ, వైసీపీల మధ్యనే పోటీ ఉన్నట్లుగా జాతీయ సర్వేలు ఫలితాలు ప్రకటిస్తున్నాయి అంతా అనుకున్నారు. జనసేనకు స్థానం ఎక్కడ, ఆ పార్టీ స్టామినా ఎంత అన్నదానిపైన కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇపుడు ఆ ముచ్చట తీరుస్తూ ఓ కొత్త సర్వే వచ్చేసింది. ఆ సర్వే కూడా యధాప్రకారంగా వైసీపీదే ఏపీలో లాండ్ మార్క్ విజయం అని తేల్చేసింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం ఒకటి ఉంది. అదేంటి అంటే జనసేన పార్టీ ఈసారి సర్వేలో కనిపించడం. పైగా ఆ పార్టీ ఓట్ల షేరింగ్. ఆ పార్టీ పోటీ వల్ల ఎవరికి లాభం, నష్టం అన్నది కూడా తేల్చింది ఈ సర్వే తేల్చింది.


టీడీపీకేనట :


జనసేన వచ్చే ఎన్నికలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని వీడీపీ అసోసియేట్స్ సర్వే అంచనా వేసింది. 5.9 శాతం ఓట్లను పవన్ కల్యాణ్ పార్టీ సాధిస్తుందని.. అయితే ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెల్చుకోలేదని స్పష్టం చేసింది. టీడీపీ-జనసేన మధ్య కాపు ఓట్ల చీలిక జరుగుతుందని.. తద్వారా వైసీపీ లాభపడుతుందని అంచనా వేసింది. అంటే జనసేన వల్ల ఇన్నాళ్ళూ  అంతా వూహిస్తున్నట్లుగా రెండు పార్టీలకు నష్టం మాట అటుంచి టీడీపీకి పెద్ద దెబ్బ పడుతుందని ఈ సర్వే ద్వారా తెలుస్తోంది.


బహుముఖమే లాభమా :


ఈ సర్వే మరో విషయాన్ని కూడా బయట పెట్టింది. ఏపీలో బహుముఖ పోటీల వల్ల అధికార పక్షం వ్యతిరేక ఓట్లు చీలి టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు తప్పు అని స్పష్టం చేసింది. ప్రజలు తలచుకుంటే తాము కోరుకున్న పార్టీని కచ్చితంగా క్లారిటీగా ఓటేసి ఎన్నుకుంటాయని పక్కాగా చెప్పేసింది. ఈ మధ్యన మధ్యప్రదేశ్, చత్తెస్ ఘడ్ లలో కూడా అదే జరిగింది. విపక్షాల చీలికలతో బాగుపడదామనుకున్న బీజేపీకి  అక్కడ భంగపాటు ఎదురైంది. అంటే ఈనాటి ఓటర్లు తెలివిగా ఉంటున్నారని ఇటీవల ఎన్నికలు ప్రూవ్ చేస్తున్నాయి. మరి ఏపీలో ఈ సర్వేలు నిజమైతే మాత్రం ఓటర్ల మేధస్సుకు మరో మారు ధన్యవాదాలు చెప్పాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: