నాగబాబు నా ఇష్టం నా ఛానల్ అంటూ చేస్తున్న హంగామా చూస్తూనే ఉన్నాము. ఇప్పడూ ఏకంగా సీఎం చంద్ర బాబు ను టార్గెట్ చేశాడు. రక్తం పొంగిపోతోందంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై సెటైరిక్ గా స్పందించారు నాగబాబు. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ నేతలపై భగ్గుమన్న చంద్రబాబు.. రక్తం పొంగిపోతోందంటూ వ్యాఖ్యానించారు. దీనిపైనే నాగబాబు స్పందించారు. పాలు పొంగడానికి నాలుగున్నర నిమిషాలు పట్టింది.

Image result for nagababu

చంద్రబాబు రక్తం పొంగడానికి నాలుగున్నరేళ్లు సమయం పట్టింది. ఎక్కువ మంట పెడితేనే పాలు మరుగుతాయి. ఎలక్షన్లు వస్తేనే మన చంద్రబాబు నాయుడు రక్తం మరుగుతుంది. ఇలా చంద్రబాబుపై నేరుగా విమర్శలు చేశారు నాగబాబు. నా ఇష్టం నాగబాబు ప్రారంభించిన ఈ ప్రహసనంలో ఇప్పటివరకు బాబును టార్గెట్ చేయలేదు. బాబు కామెంట్స్ పై నాగబాబు వీడియో పెట్టడం ఇదే ఫస్ట్ టైం. 

Image result for nagababu

ఏబీఎన్ రాధాకృష్ణపై నేరుగా విమర్శలు చేసిన నాగబాబు.. కాపీరైట్ ఇష్యూస్ కారణంగా ఆ వీడియోను తొలిగించారు. ఇప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేస్తూ అసెంబ్లీలో అతడు ప్రసంగించిన క్లిప్ ను పోస్ట్ చేశారు. మరి ఈ వీడియో అయినా ఉంటుందా లేక కాపీరైట్ చిక్కుల్లో పడి ఊడుతుందా అనేది చూడాలి. మొత్తానికి మెగా బ్రదర్ జనసేన కు మైలేజ్ తీసుకురావటానికి బాగానే ప్రయత్నిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: