ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అంతటా అలుముకుంది. ఒకపక్క ప్రతిపక్ష పార్టీ వైసిపి పార్టీ ప్రజల అభిమానాన్ని దోచుకుంటూ ముందుకెళుతుంటే మరోపక్క అధికారంలో ఉన్న టీడీపీ కూడా సంచలన హామీలు ప్రకటిస్తూ ఏపీ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తోంది.

Image result for whats app

ఇదిలా ఉండగా తాజాగా వాట్పప్ సంస్థ టిడిపి పార్టీకి చెందిన సీఎం రమేష్ కి ఊహించని షాక్ ఇచ్చింది. కారణం ఏమోకాని తెలుగుదేశం ఎమ్.పి సి.ఎమ్.రమేష్ వాట్పప్ ఖాతాను ఆ సంస్థ నిలుపుదల చేసింది. దానిపై ఆయన వాట్సప్ సంస్థకు లేఖ రాశారు.తన పోన్ వాట్సప్ పనిచేయడం లేదని ఆయన తెలిపారు.

Image result for cm ramesh

దానికి వాట్సప్ సంస్థ సమాదానం ఇస్తూ రమేష్ వాట్సప్ వాడుకునే హక్కు కోల్పోయారని తెలియచేసింది.పలువురి నుంచి పిర్యాదులు రావడంతో అలా చేశామని కూడా తెలిపింది.తాను ఎమ్.పినని ఆయన పేర్కొన్నా వాట్పప్ తన అభిప్రాయం స్పష్టంగా పేర్కొనడం విశేషం.

Related image

ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయనే విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు.అయితే వాట్సాప్‌పై కేంద్రం నిఘా పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉండవచ్చని రమేష్ అనుమానం వ్యక్తం చేశారు.రమేష్ వాట్పప్ ను దుర్వినియోగం చేశారన్న అభియోగాలు వచ్చాయా?ఏమిటో తెలియదు.



మరింత సమాచారం తెలుసుకోండి: