ఏపీలో జగన్ రాజకీయం భలే చిత్రంగా ఉంటుంది. టచ్ మీ నాట్ పాలిటిక్స్ చేస్తారని ఆయనకు పేరు. జనాలకు సంబంధించిన విషయాల్లో జగన్ అందరి కంటే వేగంగా స్పందిస్తారని పేరుంది. మరి ఆ టెంపోను ఆయన అదే వేగంతో కొనసాగిస్తున్నారా అన్న‌దే ఇక్కడ ప్రశ్న.


హోదా ఊసే లేదు :


ఏపీకి హోదా ఈ రోజు ఇలా ఉందంటే దానికి వైసీపీ పోరాటాలు, ప్రత్యేకించి జగన్ చేసిన ఉద్యమాలు కారణం. ఈ రోజు బాబు చేస్తున్నవన్నీ జగన్ ఎపుడో చేశారు. 2015న ప్రధాని మోడీ వచ్చినపుడు ఆయనకు తెలియాలని జగన్ ఏకంగా వారం రోజుల పాటు హోదా మీద నిరాహారదీక్ష చేశారు. ఇపుడు బాబు ఎన్నికలు ముంగిట్లో పెట్టుకుని ఒక్క రోజు దీక్ష చేస్తున్నారు. ఇక జగన్ డిల్లీలో కూడా దీక్ష ఎపుడో చేశారు. ప్రతీ జిల్లాలో యువ భేరీలు వంటివెన్నో నిర్వహించారు. బందులు కూడా చేశారు. మరి అన్నీ చేసిన జగన్ అసలైన టైలో ఏం చేస్తున్నట్లు.


బాబు అందుకున్నారుగా :


ఏది ఎపుడు చేయాలో బాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. బాబు నాలుగేళ్ల పాటు హోదా ఊసు ఎత్తలేదు, ఎన్నికలు దగ్గర ఉన్నాయనగా హోదా అంటూ కలవరిస్తున్నారు. నాలుగేళ్ళు మోడీతో అంటకాగిన టీడీపీ ఇపుడు నల్ల జెండాలతో మోడీకి నిరసన తెలియచేస్తోంది. డిల్లీలో దీక్షలు అంటోంది. హోదా కోసం ఇప్పటికే పోరాడుతున్న ప్రజా సంఘాలు, వామపక్షాలు సైతం టీడీపీకే మద్దతు ఇస్తున్నాయి.  ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ ఎక్కడ ఉంది.


హోదా పోరాటమేదీ :


హోదా కోసం ఏకంగా పార్లమెంట్ ఎంపీలను రాజీనామ చేయించిన జగన్ దాన్ని జనంలో ప్రచారం చేసుకోలేకపోయారు. ఇపుడు టీడీపీ హోదా కోసం చేస్తున్న హడావుడితో జనం అటు వైపుగా చూస్తున్నారు మరి హోదా అంటూ నాలుగేళ్ళ పాటు పోరాడిన వైసీపీ ఇపుడు ఎందుకు సైలెంట్ అయింది. ఇది జనం నుంచి వస్తున్న ప్రశ్న. టీడీపీతో కలసి తాము పోరాటాలు చేయామని వైసీపీ స్పష్టంగా చెప్పింది.  రాజకీయ విధానంగా అది కరెక్ట్ అనుకుందాం, కానీ అసలు హోదా పోరాటమే వైసీపీ సొంతంగా చేయకపోతే ఎలా. ఎన్నికల వేళలోనే ఏం చేసినా జనం రియాక్షన్ ఉంటుంది. నాలుగేళ్ళు చేసాం, జనం ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటే. మరి వైసీపీ హోదా పోరు అందుకుంటుందా దాన్ని టీడీపీకి వదిలేసి , ఇలాగే చూస్తూ వూరుకుంటుందా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: