ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిల్లీలో పన్నెడు గంటల దీక్ష ప్రారంభమైంది. రాత్రి ఎనిమిది గంటల వరకూ ఏకధాటిన సాగే ఈ దీక్షపై టీడీపీ ఎన్నో రాజకీయ ఆశలు పెట్టుకుంది నిజానికి ఈ నెల 13న దీక్ష జరగాలి కానీ రెండు రోజులు ముందే దీక్షలు బాబు రెడీ అయ్యారు.  డిల్లీ చలిలో హీట్ పుడుతుందా...


కసి మీదున్న బాబు:


సరిగ్గా ఇరవై నాలుగు గంటల ముందే ఏపీకి ప్రధాని మోడీ వచ్చి బాబును దారుణంగా విమర్శించారు. ఏపీలో బాబు పాలన అంతం అవుతుందని జోస్యం చెప్పేశారు. బాబు అవినీతి మీద కూడా విరుచుకుపడ్డారు. దాంతో బాబు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. అయితే ఆ డోస్ సరిపోతుందా, అందువల్ల డిల్లీ దీక్షలో బాబు ఎటువంటి  సంచలన ప్రకటనలు చేస్తారో అని అంతా ఆసక్తి చూపుతున్నారు. బాబు వర్సెస్ మోడీగా మారిన రాజకీయంలో పై చేయి కోసం బాబు ఈ దీక్షను బాగా ఉపయోగించుకుంటారని అంటున్నారు.


జాతీయ నేతల మద్దతు :


బాబు డిల్లీ దీక్షకు జాతీయ నాయకులు మద్దతు ప్రకటించారు. అయితే వీరిలో ఎంతమంది స్వయంగా హాజరు అవుతారన్నది చూడాలి. అలాగే బాబు వారితో కలసి మోడీ వ్యతిరేక కూటమికి బలోపేతం చేయడంపై మరింతగా ద్రుష్టి సారిస్తారని కూడా అంటున్నారు. దీక్ష విరమణ అనంతరం బాబు రాష్ట్రపతిని ఇతర జాతీయ నేతలతో కలసి వినతిపత్రం సమర్పిస్తారని అంటున్నారు. ఆ మీదట జాతీయ నేతలతో మీటింగు కూడా ఉంటుందని చెబుతున్నారు. 
ఇక రాహుల్ గాంధీ ఈ దీస్ఖకు స్వయంగా హాజరుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఒకవేళ ఆయన రాకపోతే బాబు రాహుల్ ని కలసి ఆయనతో రాజకీయ చర్చలు జరుపుతారని అంటున్నారు. మోడీ ఏపీలో రగిల్చిన వేడీకి ఇంతకు ఇంత బదులు తీర్చుకునేందుకు చంద్రబాబు డిల్లీ దీక్షను పదునైన ఆయుధంగా వాడుకుంటున్నారు. మరి ఈ బాణం మోడీకి ఎలా తగులుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: