పాపం టీడీపీ కి మీడియా సపోర్ట్ ఉంది కానీ సోషల్ మీడియా సపోర్ట్ లేకుండా పోయింది ఎందుకంటే సోషల్ మీడియా ప్రజలది కాబట్టి ఉన్నది ఉన్నట్టు నిలదీస్తారు. అయితే ఇప్పడూ చంద్ర బాబు తనను గాంధీ తో పోల్చు కోవటం తో సోషల్ మీడియా దాడి మొదలెట్టింది. గాంధీతో పోల్చుకునేంత మహాత్ముడు చంద్రబాబు కాదంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇప్పటివరకూ బాబు చెప్పిన అబద్ధాలపైనే ఫోకస్ పెట్టిన నెటిజన్లు.. ఇప్పుడు బాబు చెబుతున్న నకిలీ గాంధీగిరిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Image result for chandrababu naidu

గాంధీ కుటుంబానికి దగ్గరయ్యే ఆలోచనతోనే చంద్రబాబు గాంధీని వాడుకుంటున్నారని కొందరు అంటుంటే... గాంధీని అలా దుస్తులు వేసుకోమని చెప్పింది కూడా చంద్రబాబేనని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. "దేశానికి స్వతంత్ర్యం తీసుకొచ్చింది కూడా చంద్రబాబేనట. అప్పట్లో గాంధీకి బాబు మద్దతివ్వడం వల్లనే స్వరాజ్యం వచ్చిందట." ఇలాంటి పోస్టులతో ఇంకొందరు బాబుపై సెటైర్లు వేశారు.

బాబు గాంధీగిరి... సోషల్ మీడియాలో బలి

రానురాను చంద్రబాబు మాటలు మరీ కోటలు దాటిపోతున్నాయి. అబద్ధాలు ఆడటంలో తనను మించిన వారులేరని ఇప్పటికే నిరూపించిన చంద్రబాబు.. కల్లబొల్లి కబుర్లు చెబుతూ జనాల్ని మభ్యపెడుతూ వస్తున్నారు. లేకపోతే చంద్రబాబుకీ గాంధీకి పోలిక ఏంటి? దేశంకోసం జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు ఎక్కడ, కుటుంబం కోసం ఆస్తులు కూడబెడుతూ, సొంత లాభం కోసం రాష్ట్ర భవిష్యత్ నే బలిచేస్తున్న చంద్రబాబు ఎక్కడ? తాను ఏదిచెప్పినా ప్రముఖంగా ప్రచురించే మీడియా చేతిలో ఉండటంతో చంద్రబాబు ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి ప్రయత్నాలు ఎప్పటికప్పుడు బెడిసికొడుతున్నాయి. తాజాగా గాంధీ వ్యాఖ్యలతో చంద్రబాబు నవ్వులపాలవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: