సోనియా గాంధీ కూతరు  , ఇందిరా గాంధీ మానవురాలు అయినటువంటి ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి చాలా లేట్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానే రాజకీయ ప్రత్యర్ధులు మాటల దాడిని షురూ చేశారు. కొంత మంది బీజేపీ నాయకులూ అయితే ఆమె మీద సెక్సీ కామెంట్స్ చేశారు. ప్రియాంక గాంధీ అందంగా ఉంటారని , కానీ అందాన్ని చూసి ఓట్లు ఎవరు వేయరని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినారు. మరో బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి అయితే ఏకంగా ప్రియాంకను మెంటల్ కేస్ అని దారుణంగా వ్యాఖ్యలు చేశాడు. 

priyanka gandhi కోసం చిత్ర ఫలితం

అయితే ప్రియాంక ఇవేమి పట్టించు కోకుండా ప్రచారం లో దూకుడుగా సాగిపోతుంది. ఉత్తర ప్రదేశ్ బాధ్యతల ను ప్రియాంక కు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే అందరూ అనుకున్నట్టు ప్రియాంక కోసం జనాలు బాగా వస్తున్నారు. అచ్చం ఇందిరా గాంధీ పోలికలతో ఉండటం ప్రియాంక కు ప్లస్ అని చెప్పాలి. జనాలు భారీగా రావటం తో కాంగ్రెస్ లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదే సమయం లో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు పుడుతున్నాయి. 

priyanka gandhi కోసం చిత్ర ఫలితం

ఉత్తర ప్రదేశ్ లో 2019 ఎన్నికలకు చిర కాల ప్రత్యర్థులైన ఎస్ పి, బిఎస్పీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కూటమి లో కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వలేదు. కేవలం రెండు స్థానాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ కి విడిచి పెట్టారు. అయితే ఇప్పుడు ప్రియాంక రాక తో కాంగ్రెస్ బల పడబోతుందని రెండు పార్టీ లు అంచనా వేస్తున్నాయి. వారి అంచనా నిజమైతే నిజంగా వారికి దెబ్బె అని చెప్పాలి. అందుకే కాంగ్రెస్ తో లోపాయికారి ఒప్పందానికి రెండు పార్టీ లు ఎవరి ప్రయత్నాలు వారు మొదలెట్టినారని సమాచారం. అలాగే కాంగ్రెస్ కు కానీ ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ సీట్లు వస్తే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి ఇబ్బందే అని చెప్పాలి . ఎందుకంటే మమతా పీఎం పదవి మీద బాగానే ఆశలు పెట్టుకున్నది. ఒక్క సారిగా ప్రియాంక ఎంట్రీ తో రాజకీయలు మారిపోయాయని చెప్పి తీరాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: