ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు జారిపోతారేమో నని బాబు ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే కడపలో ఉన్న ఏకైక టీడీపీ ఎమ్మెల్యే వైస్సార్సీపీ లోకి వెళ్లి పోయాడు. అయితే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కూడా టీడీపీ కి రాజీనామా చేసి వైస్సార్సీపీ లోకి చేరిపోయాడు. లోటస్ పాండ్ లోని జగన్  నివాసం లో ఆమంచి భేటీ అయ్యాడు. మీడియా తో మాట్లాడుతూ చంద్ర బాబు పద్ధతి నచ్చకే పార్టీ మారుతున్నానని చెప్పాడు. చంద్రబాబు నాయుడుకు వయసు మీద పడిందని.. ఆయనకు ఆల్జిమర్స్ సోకినట్టుగా ఉందని ఈ ఎమ్మెల్యే అన్నారు. బాబు ఒకరోజు మాట్లాడినట్టుగా మరోరోజు మాట్లాడటం లేదని.. ఈరోజు మాట్లాడింది ఆ రోజుకే అన్నట్టుగా తయారైందని ఆమంచి అన్నారు.

Image result for chandrababu naidu

హోదా విషయంలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో, ఎలా యూటర్న్ తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే అని అన్నారు. ఇక డ్వాక్రా మహిళలకు ఇప్పుడు పుసుపు- కుంకుమ అంటూ మరో మోసం చేస్తున్నారని.. వాస్తవానికి వారికి వడ్డీ డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉందని.. ఆ డబ్బు బకాయిలు ఆరువేల ఐదువందల కోట్లరూపాయల వరకూ ఉన్నాయన్నారు. వాటిని పక్కనపెట్టి.. ఇప్పుడు ఓటుకు రెండు వేల రూపాయలు అన్నట్టుగా డ్వాక్రా మహిళలకు ఇస్తూ అనైతిక రాజకీయం చేస్తున్నారని ఆమంచి అన్నారు.

బాబుకు ఆల్జీమర్స్ వచ్చినట్టుందిః ఆమంచి

బాబుతో మాట్లాడితే పిచ్చి ఎక్కిపోయే పరిస్థితి ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే విషయంలో తన గురువు రోశయ్య ఆశీస్సులు తనకు ఉన్నాయని ఆమంచి అన్నారు. రాష్ట్రంలో ఒక కులం గుత్తాధిపత్యం కోసం పాకులాడుతోందని.. చంద్రబాబు నాయుడును వారే ఆడిస్తున్నారని.. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు చదివితే, కొన్ని చానళ్లు చూస్తే వాస్తవాలు తెలిసే పరిస్థితి లేదని.. చంద్రబాబు పాలనను వాటి ద్వారా చూస్తే కలిగేది భ్రమలే అని ఆమంచి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: