విశాఖపట్నం ఎంపిగా టిక్కెట్టిస్తే పోటి చేయటానికి రెడీగా ఉన్నట్లు శ్రీ భరత్ బహిరంగంగా ప్రకటించారు. భరత్ అంటే నందమూరి బాలకృష్ణ అల్లుడని, ఎంవివిఎస్ మూర్తి మనవడని అందరికీ తెలిసిందే. మూర్తిది రాజకీయ కుటుంబమే కాబట్టి అందులోను బరత్ బాలకృష్ణకు అల్లుడు కాబట్టి టిక్కెట్టు సాధించుకోవటంలో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదేమో ? విశాఖ ఎంపిగా పోటీ బాలకృష్ణ చిన్నల్లుడు పోటీ చేయనున్నట్లు ఎప్పటి నుండో మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

 

అయితే ప్రచారమంతా ప్రచారంగానే ఉండిపోయింది. భరత్ ఖండిచలేదు, కన్ఫర్మ్ చేయలేదు. కానీ తాజాగా విశాఖపట్నం లోక్ సభ నుండి పోటీ చేయాలనుందని చెప్పటం గమనార్హం. అంటే లోపాయికారీగా టిక్కెట్టు విషయంలో చంద్రబాబునాయుడు నుండి తగిన హామీ అందుకున్న తర్వాతే భరత్ ఎంపి టిక్కెట్టుపై ఓపెన్ అయినట్లున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే భరత్ ఏరోజూ పార్టీ జెండా పట్టుకుని పనిచేసిందే లేదు. అయినా ఎంపి టిక్కెట్టుపై కన్నేశారంటే అర్ధమేంటి ?

 

తనకున్న బంధుత్వాలు, వారసత్వం ఆధారంగా మాత్రమే భరత్ టిక్కెట్టు ఆశిస్తున్న విషయం అర్ధమైపోతోంది. సరే టిక్కెట్టంటే బాలయ్య అల్లుడు, లోకేష్ తోడల్లుడు కాబట్టి సాధించుకోవచ్చు. కానీ లీడర్లు, క్యాడర్ ఎంతమేర సహకరిస్తారో గమనించాలి. అందులోను చంద్రబాబు నాలుగున్నరేళ్ళ పాలనపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో ఎన్నికల్లో అరంగేట్రం చేయటమంటే మామూలు విషయం కాదు. అంటే టిక్కెట్టు తెచ్చుకున్నంత సులువు కాదు గెలవటమంటే.  మరి భరత్ విషయంలో ఏమవుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: